Ravi Krishna: ‘లవ్ మీ’ కోసం ‘పుష్ప 2’ వదులుకున్నాడట..!

  • May 24, 2024 / 08:07 PM IST

రవికృష్ణ అందరికీ తెలుసు కదా..! ‘మొగలిరేకులు’ తో పాటు పలు హిట్ సీరియల్స్ లో నటించాడు. అయితే ‘బిగ్ బాస్ 3 ‘ తో ఇతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సీజన్లో అతను విన్నర్ కాకపోయినా..తన మంచితనంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో ఇతనికి ఛాన్సులు వచ్చాయి. కానీ ‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాలో ఇతను చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎవ్వరూ ఊహించని షాకింగ్ రోల్లో అతను ఆ సినిమాలో కనిపించాడు.

ఆ సినిమా వల్ల అతనికి ఏకంగా ‘పుష్ప 2’   (Pushpa 2)  వచ్చిందట. కానీ ‘లవ్ మీ’ (Love Me) సినిమా వల్ల అతను ఆ ఆఫర్ ను కాదనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా రవికృష్ణ చెప్పుకొచ్చాడు. రవికృష్ణ మాట్లాడుతూ… “నాకు ‘పుష్ప 2 ‘ లో ఛాన్స్ వచ్చింది. కానీ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల మిస్ అయ్యాను. దీంతో నేను చాలా బాధ పడ్డాను. ఓ పెద్ద మిస్ అయ్యాను అనే ఫీలింగ్ కలిగింది. అయితే ‘లవ్ మీ’ మేకర్స్ నాకు ఒక్కటే చెప్పారు.

‘ఈ సినిమా కోసం ‘పుష్ప 2 ‘ మిస్ అయ్యావు. ఓ పెద్ద ఆఫర్ వదులుకున్నావు. అయినప్పటికీ ఈ సినిమా కచ్చితంగా నీ కెరీర్లో మైల్ స్టోన్ గా మిగులుతుంది. అంటూ భరోసా ఇచ్చారు. నాకు కూడా అదే నమ్మకం కలిగింది.నన్ను నమ్మి ఇలాంటి పాత్ర నాకు ఇచ్చినందుకు థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus