పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ భార్య!

‘ఆహా నా పెళ్ళంట’ ‘పంచాక్షరీ’ ‘దేనికైనా రెడీ’ వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించిన సామ్రాట్ పలు వివాదాలతో, ‘బిగ్ బాస్ 2’ షో తో బాగా పాపులర్ అయ్యాడు. గతంలో సామ్రాట్ హర్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయాడు. ఆ ప్రాసెస్ లో ఎన్నో వివాదాలు ఫేస్ చేశాడు ఈ సామ్రాట్ రెడ్డి. ఇతన్ని గే అంటూ ఎంతో మంది విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

సామ్రాట్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా.. అతని మొదటి భార్య కేసు వేసింది. హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న రోజుల్లో అతను హౌస్ నుండి కోర్టు విచారణకు హాజరవుతూ ఉండేవాడు.విచారణ అనంతరం మళ్ళీ హౌస్ లోకి వెళ్లిపోయేవాడు. అదే టైములో మరో కంటెస్టెంట్ తేజస్వి వల్ల కౌశల్ ఆర్మీకి చిక్కిన సామ్రాట్ .. ఘోరంగా ట్రోల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కోవిడ్ టైంలోనే కాకినాడకు చెందిన అంజనా శ్రీలిఖిత అనే యువతిని సామ్రాట్‌ రెండో విహాహం చేసుకున్నాడు.

జూన్ నెలాఖరులో తన భార్య బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఆగస్టు 15న సామ్రాట్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఈ గుడ్ న్యూస్ ను సామ్రాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఇండిపెండెన్స్‌ డేని ఇంత సంతోషంగా సెలబ్రేట్‌ చేసుకోవడం ఎంతో కొత్త అనుభూతిని ఇస్తుంది. నా ముద్దుల కూతురుకి దీవెనలు’ అంటూ సామ్రాట్ పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus