రామరాజ్యం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు నటుడు శరత్ బాబు. ఇలా హీరోగా తెలుగు తమిళ కన్నడ భాషలలో సుమారు 200 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన శరత్ బాబు మే 22వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా శరత్ బాబు మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడుగా గుర్తింపు పొందిన ఈయన చివరికి మళ్ళీ పెళ్లి సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి పాత్రలో నటించారు. ఈ సినిమా 26వ తేదీ విడుదల కాబోతోంది ఈ క్రమంలోనే శరత్ బాబు గారి మరణం అందరిని ఎంతగానో కలిసి వేసింది.అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శరత్ బాబు మరణించారని తెలుస్తుంది. ఇక ఈయన అంత్యక్రియలు కూడా చెన్నైలో పూర్తి అయ్యాయి.

ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో ఆస్తుపాస్తులను కూడా పెట్టిన శరత్ బాబు మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ ఈయన కంటూ వారసులు ఎవరూ లేరు. తన సంపాదించిన ఆస్తిపాస్తులు అన్నీ కూడా తన సోదరులు వారి పిల్లల పేరిట రాసారని సమాచారం. ఇకపోతే ఆస్తులన్నీ కూడా అందరికీ పంచినా కూడా ఈయనకు అంటూ ఒక చిన్న కోరిక ఉండేదని ఆ కోరిక నెరవేరకుండానే శరత్ బాబు మరణించారని తెలుస్తోంది. మరి శరత్ బాబు చివరి కోరిక ఏంటి అనే విషయానికి వస్తే…

శరత్ బాబు (Sarath Babu) సినిమాలలో కొనసాగుతూ చెన్నై బెంగళూరు హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఎంతో ఖరీదైన ఇళ్లను ఖరీదైన స్థలాలను కొనుగోలు చేశారు. అయితే ఈయనకు ఎంతో ఇష్టమైన హార్సిలీ హిల్స్ లో ఒక అందమైన ఇంటిని నిర్మించి అక్కడ స్థిరపడాలన్నదే తన కోరిక అట. అయితే ప్రస్తుతం అక్కడ ఇంటి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలా ఇంటి నిర్మాణ పనులు పూర్తి కాకుండా ఆ ఇంటిలో ఈయన నివసించకుండానే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శరత్ బాబు మరణించారని తెలుస్తోంది.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు
