Actor Sunil: పవన్ కళ్యాణ్ అడిగారు కానీ..!

టాలీవుడ్ నటుడు సునీల్ రాజకీయాల్లోకి చేరబోతున్నారని.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ తరఫున ఆయన పోటీచేయబోతున్నారని వార్తలు వచ్చాయి. పవన్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం ప్రాంతం నుంచి సునీల్ పోటీచేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సునీల్ పుట్టి పెరిగిందంతా భీమవరంలోనే.. అక్కడ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. పవన్ పార్టీ అంటే కచ్చితంగా జనసైనికుల సపోర్ట్ ఉంటుంది. దీంతో సునీల్ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం ఖాయమని అనుకున్నారు.

Click Here To Watch Now

తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు సునీల్. తనకు రాజకీయాలపై టచ్ లేదని.. తను రాజకీయాలకు సరిపడే వ్యక్తిని కాద్దని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టమని.. ఆయన బాగా క్లోజ్ అని చెప్పారు. ఆయనకి నిజంగానే తనను పార్టీలోకి తీసుకోవాలనుందని.. కానీ తనకు మాత్రం ఇష్టం లేదని చెప్పారు సునీల్. మన దగ్గర జనాభా ఎక్కువ అని.. ఫండ్స్ మాత్రం పెద్దగా ఉండవని చెప్పిన ఆయన.. ఈ ఫండ్స్ తో అందరికీ న్యాయం చేయలేమని అన్నారు.

న్యాయం జరగని వాళ్లు ఫీల్ అవుతారని.. ఈ ప్రాసెస్ లో మనం ఎవరినీ సంతృప్తి పరచలేమని అన్నారు. అన్నయ్య చిరంజీవి, కళ్యాణ్ గారు ఇద్దరూ ప్రోత్సహించడానికి రెడీగా ఉంటారని.. కానీ మనం వస్తే చప్పట్లు కొట్టి విజిల్స్ వేయాలి.. అలాంటి పరిస్థితి లేనప్పుడు బాధగా ఉంటుందని చెప్పారు. అందుకే కళ్యాణ్ గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పానని స్పష్టం చేశారు. కళ్యాణ్ గారంటే చాలా ఇష్టమని.. ఆయనకు తనవంతుగా ఏదైనా చేయగలిగినప్పుడు మాత్రం తప్పకుండా చేస్తానని..

కానీ అది రాజకీయంగా కాదని చెప్పారు. ఎందుకంటే తనకు రాజకీయం అంటే ఏంటో తెలియదని.. తను రాజకీయాలకు సూట్ అవ్వనని మరోసారి తేల్చి చెప్పారు. సునీల్ మాటలను బట్టి ఆయనకు రాజకీయాలపై ఆసక్తి లేదనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus