కోలీవుడ్ సీనియర్ నటుడు డిఎండికే పార్టీ నేత దివంగత నటుడు విజయ్ కాంత్ గత ఏడాది చివరిన మరణించిన సంగతి మనకు తెలిసిందే. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి విజయ్ కాంత్ రాజకీయాలలో కూడా తనదైన ముద్ర సంపాదించుకున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కెప్టెన్ విజయ్ కాంత్ గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ మరణించారు. ఇలా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
అయితే అప్పటికే ఆయనకు కరోనా కూడా రావడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా మారి ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఇక కెప్టెన్ మరణించడంతో ఎంతోమంది కోలీవుడ్ సెలబ్రిటీలో ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఈయనకు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. అందుబాటులో ఉన్నటువంటి సినీ సెలబ్రిటీలందరూ కూడా వెళ్లి ఈయనని చివరి చూపు చూసి తనకు నివాళులు అర్పించారు.
అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం విదేశాలలో ఉండటం వల్ల ఈయన చివరి చూపుకు నోచుకోలేకపోయారు. ఈ క్రమంలోనే సూర్య కూడా ఇండియాలో లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా విజయ్ కాంత్ మరణం పై స్పందించి విజయ్ కాంత్ తో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈయన చెన్నై రావడంతో విజయ్ కాంత్ సమాధిని దర్శించుకున్నారు.విజయ్ కాంత్ సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అయితే ఈయన విజయ్ కాంత్ సమాధిని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్ కాంత్ గారు లేరనే వార్త నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉందని తెలిపారు ఆయనలో ఒక కన్నులో ఒక కన్ను ధైర్యం మరొక కన్ను కరుణతో జీవించిన అరుదైన నటుడు అంటూ సూర్య ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన సమాధిని దర్శించుకున్న అనంతరం (Suriya) సూర్య విజయ్ కాంత్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు.
நடிகர் திரு.சிவக்குமார், திரு.சூர்யா, திரு.கார்த்திக் அவர்கள் இன்று (05.01.2024) கோயம்பேட்டில் உள்ள கேப்டன் நினைவிடத்தில் அஞ்சலி செலுத்திவிட்டு, சாலிகிராமத்தில் உள்ள கேப்டன் வீட்டிற்கு நேரில் சென்று பொதுச்செயலாளர் திருமதி.பிரேமலதா விஜயகாந்த் அவர்களை சந்தித்து ஆறுதல் தெரிவித்தார் pic.twitter.com/6rtR6EXMsk
— Vijayakant (@iVijayakant) January 5, 2024
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!