ఉద్భవ్ అంటే ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు కానీ చికాగో సుబ్బారావ్ అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. యూట్యూబ్ లో తన వీడియోలతో అంతగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు ఈ కుర్ర నటుడు. అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం తెచ్చుకున్న ఉద్భవ్ కి అవేవీ సంతృప్తినివ్వలేదు. దీంతో తనకు ఇష్టమైన సినిమా ఇండస్ట్రీలో రాణించాలని అమెరికా నుండి హైదరాబాద్ చేరుకున్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా సినిమాలు చేయాలనేది ఉద్భవ్ కోరిక. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘కమిట్‌మెంటల్’ సిరీస్ ఆహా యాప్ లో రిలీజయింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉద్భవ్ తనకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నాడు.
చిన్నప్పటినుండే సినిమాలంటే ఆసక్తి అని.. కాలేజ్ చదివే రోజుల్లో ఓ షార్ట్ ఫిలిం తీశానని చెప్పారు. స్నేహితులంతా మొహమాటంగా తను తీసిన సినిమా బావుందని చెప్పినా.. తన తల్లి మాత్రం బాలేదని నిర్మొహమాటంగా చెప్పేసిందని.. దీంతో మంచి షార్ట్ ఫిలిం తీయాలనే పట్టుదలతో ‘ప్రేమ ఎంత మధురం’ తీశానని.. దానికి అందరి నుండి మంచి అప్లాజ్ వచ్చిందని చెప్పారు. ఆ తరువాత అమ్మ కోరిక మేరకు అమెరికా వెళ్లి.. చదువు పూర్తి చేసి ఉద్యోగం జాయిన్ అయ్యానని చెప్పారు. ఆ తరువాత అమెరికాలో ఉంటున్న స్టూడెంట్స్, ఎంప్లాయిస్ జీవితాలు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్ తో షార్ట్ ఫిలిం తీస్తే సక్సెస్ అయిందని.. దీంతో తనే సొంతంగా ‘చికాగో సుబ్బారావ్’ అనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి పలు షార్ట్ ఫిలిమ్స్ తీసి అందులో రిలీజ్ చేశానని అన్నారు.
ఈ ఛానెల్ తనకు మంచి పేరు తీసుకొచ్చిందని.. ఈ క్రమంలో తనకు కొన్ని సినిమాలకు ప్రమోషన్ వీడియోలు చేసే ఛాన్స్ రావడంతో పరిచయాలు పెరిగి.. తనకు నచ్చిన రూట్ లోకి వెళ్లడానికి ఛాన్స్ వచ్చిందనే ఆనందం కలిగిందని చెప్పుకొచ్చారు. ఆన్లైన్ ఆడిషన్స్ వర్కవుట్ అవ్వడం లేదని.. అమెరికాలో జాబ్ వదిలేసి హైదరాబాద్ వచ్చేసి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇక్కడకి వచ్చిన తరువాత ఆడిషన్స్ ఇచ్చినా.. పలు కారణాలతో పక్కన పెట్టేసేవారని.. అదే సమయంలో వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ వచ్చిందని చెప్పారు.
తమడా మీడియా సహనిర్మాతగా వ్యవహరించిన ‘కమిట్‌మెంటల్’ సిరీస్ లో ఫణి పాత్రకు తమడా సంస్థ వారు తనను సజెస్ట్ చేశారని.. ఆడిషన్స్ చేసి ఫైనల్ చేశారని చెప్పుకొచ్చాడు. అయితే మార్చిలో షూటింగ్ మొదలుపెడితే మూడురోజులకు లాక్ డౌన్ వచ్చిందని.. దీంతో ఆ సమయంలో చాలా బాధపడినట్లు చెప్పారు. కానీ ఫైనల్ గా షూటింగ్ పూర్తి చేసి దీపావళికి ‘ఆహా’ రిలీజ్ చేయగలిగామని చెప్పుకొచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ గారు ‘యాక్టింగ్ చింపేశావ్’ అంటూ తనను మెచ్చుకున్నారని తెలిపారు.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!