Actor Venu: మా నాన్న చెప్పిన మాటకే నేను ఆ హీరోయిన్ ఒప్పుకున్న హీరో వేణు!

హీరో వేణు తొట్టెంపూడి 1999 లో వచ్చిన ‘స్వయంవరం’ అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని మాత్రమే కాకుండా నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వేణు టాలీవుడ్లో వెంకటేష్ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కువగా చేరువ అయ్యాడు. అయితే వేణు కెరీర్ లో మంచి విజయాలతో పాటు అపజయాలు కూడా వున్నాయి. 2013 వచ్చిన ‘రామాచారి’ సినిమా తరువాత సినిమాలకు దూరం అయ్యి అమెరికాలో స్థిరపడిన వేణు.

చాలా గ్యాప్ తరువాత ప్రస్తుతం రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా విరామం తరువాత సినిమాలో కనిపించిన వేణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో వేణు తన సినీ ప్రయాణం గురించి, మొదటి సినిమా తాను చేయడానికి ఎదుర్కొన్న కష్టాల గురించి పంచుకున్నారు. మొదట తన స్నేహితుడు శ్యామ్ ప్రసాద్ ఎస్ పి ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి, నేను హీరోగా ఒక సినిమా చేయాలని.

చంద్ర సిద్ధార్థ దర్శకత్వం కాగా ఆర్ పి పట్నాయక్ సంగీతం అని అనుకోగా, త్రివిక్రమ్ ‘స్వయంవరం’ కథని చెప్పడం నచ్చడం తో మొదలు పెట్టడం జరిగిందని చెప్పాడు. అయితే కొన్ని కారణాల వలన చంద్ర సిద్దార్థ తప్పుకోవడం తో విజయం భాస్కర్ దర్శకత్వం తో మళ్ళీ కొత్తగా ప్రాతంభించాము అని చెప్పారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

ఇక హీరోయిన్ ని మార్చాలని అనుకోని మా (Venu) నాన్నకి చెప్పగా ఆయన ఇపుడు లయ గురించి ఆలోచిస్తున్నట్టు నీ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది నీకు అని అన్నారు. దాంతో లయనే హీరోయిన్ గా ఫిక్స్ అవుదాం అని డైరెక్టర్ తో మాట్లాడినట్లు అయన చెప్పారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యాక మాత్రం ఎన్ని అవార్డులు గెలుచుకుందో, ఎంత విజయం సాధించిందో మనకందరికి తెలిసిందే.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus