డిఫెరెంట్ స్లాంగ్ తో ఆకట్టుకున్న నటీనటులు

  • February 7, 2018 / 12:49 PM IST

కొత్తదనం ఉంటే సినిమాకి హిట్ గ్యారంటీ. కొత్త కథ.. విభిన్నమైన కథనం ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతారు. అందుకే నటీనటులు కూడా సినిమాకి సినిమాకి కొత్తలుక్ తో కనిపిస్తుంటారు. ఈ మధ్య రూపంలోనే కాదు.. మాటల్లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డిఫెరెంట్ స్లాంగ్ తో ఆకట్టుకుంటున్నారు. అలా మెప్పించిన తారలపై ఫోకస్..

అల్లు అర్జున్ (రుద్రమ దేవి) అల్లు అర్జున్ రుద్రమ దేవిలో గోన గన్నారెడ్డిగా అదరగొట్టారు. ఇందులో అతను తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మెప్పించారు. “నేను తెలుగు భాష లెక్క, ఆడ ఉంటా, ఈడ ఉంటా” అంటూ అందరినీ అలరించారు.

సాయి పల్లవి (ఫిదా)తెలంగాణలో పుట్టిపెరిగిన నటీనటులు తెలంగాణ యాసలో మాట్లాడడం స్పెషల్ కాదు. కానీ తమిళనాడులో పుట్టి పెరిగిన సాయి పల్లవి తొలి సినిమాతోనే అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా మాట్లాడి అందరితో ఫిదా అనిపించుకుంది.

ప్రియదర్శి ( పెళ్లిచూపులు) పెళ్లిచూపులు సినిమా పేరు చెప్పగానే ప్రియదర్శి పేరు గుర్తుకు వస్తుంది. తన డైలాగ్ డెలవిరీతో అంతలా నవ్వించాడు. “నా చావు నే చస్తా నీకెందుకు” అనే డైలాగ్ అందరికీ గుర్తిండి పోయింది.

ఎన్టీఆర్ (అదుర్స్ ) బ్రాహ్మణుల నోటి నుంచి తెలుగు భాష కొత్తగా వినిపిస్తుంటుంది. ఆ స్లాంగ్ ని ఓ పట్టు బట్టి అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ పలికారు. పకపకా నవ్వించారు.

రాహుల్ రామకృష్ణ (అర్జున్ రెడ్డి ) అర్జున్ రెడ్డి సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటు చివరి వరకు జర్నీ అయ్యే రోల్ శివ. ఈ పాత్రలో రాహుల్ రామకృష్ణ చెప్పిన ప్రతి డైలాగ్ చాలా నేచురల్ గా ఉంటుంది.

విజయ శాంతి ( ఒసేయ్ రాములమ్మ ) కొన్నేళ్ల క్రితం తెలంగాణ మారుమూల గ్రామాల్లో ప్రజలు ఎలా మాట్లాడుకునేవారో.. అదే విధంగా ఒసేయ్ రాములమ్మ సినిమాలో విజయ్ శాంతి మాట్లాడి విజయాన్నీ, అభినందనలను అందుకుంది.

రామ్ చరణ్ (రంగస్థలం ) వెండితెరపై గోదావరి యాసలో అనేకమంది నవ్వులు పూయించారు. అయితే ఆ యాసలో రామ్ చరణ్ తొలిసారి రంగస్థలంలో మాట్లాడారు. సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా టీజర్ లో చెప్పిన డైలాగ్స్ తోనే అందరినీ చెర్రీ ఆకర్షించారు.

ఇంకా మేము ఏ పాత్రనైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus