Pushpa Movie: బన్నీ సూపర్‌హిట్‌ను మిస్‌ చేసుకుంది ఎవరంటే?

అదృష్టం తలుపు తట్టినప్పుడే తీయాలి అంటారు. ఒకవేళ అలా తీయకపోతే… ఆ అదృష్టం మిస్‌ చేసుకున్నట్లే. సినిమాల విషయంలోనూ అంతే. హిట్‌ సినిమా కథ, పాత్ర మన దగ్గరకు వచ్చినప్పుడు కాదనుకుంటే… అది వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. టాలీవుడ్‌ రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘పుష్ప’ విషయంలోనూ ఇదే జరిగింది. ఆ సినిమాలో హిట్‌ క్యారెక్టర్స్‌ను వదులుకున్న నటులు వీళ్లే అంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

‘పుష్ప’ సినిమాను వన్‌ మ్యాన్‌ షో అని చెప్పొచ్చు. ఆ వన్‌ మ్యానే అల్లు అర్జున్‌. ‘పుష్ప’రాజ్‌గా అల్లు అర్జున్‌ ఆ పాత్రలో ఒదిగిపోయాడు, జీవించేశాడు అని అంటే చాలా తక్కువనే చెప్పాలి. ‘పుష్ప’ అంటే బన్నీ… బన్నీ అంటే పుష్ప అని అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. అయితే ఆ పేరు రావాల్సింది మహేశ్‌బాబుకు అని టాక్‌. అవును సుకుమార్‌ ఈ సినిమా కథను తొలుత మహేష్‌బాబుకే చెప్పారట. అయితే ఆ పాత్ర, పాత్ర చిత్రణ తనకు నప్పదు అని మహేష్‌కు అనిపించింది నో చెప్పారట.

‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్‌ తర్వాత అంతగా వినిపించే పేర్లలో శ్రీవల్లి ఒకటి. ఆ పేరుతో వచ్చిన పాట అదిరిపోయింది కూడా. అయితే ఆ పాత్ర చేసే అవకాశం తొలుత సమంతకు వచ్చిందట. ‘రంగస్థలం’లో సమంత నటనకు దర్శకుడు సుకుమార్‌ ఫిదా అయిన విషయం తెలిసిందే. అందుకే ఆమెనే ఎంచుకుందామని అనుకున్నారట. అయితే ఆ సినిమా సమయంలో సమంత ఆలోచనలు వేరే ఉండి ఆ పాత్రను వదులుకుందట. దీంతో ఆ ప్లేస్‌లోకి రష్మిక మందన వచ్చింది.. అదరగొట్టింది.

‘ఉ అంటావా… ఊ ఊ అంటావా…’ అంటూ సమంత ‘పుష్ప’రాజ్‌తో కలసి ఓ ఊపు ఊపేసింది. అయితే ఉ అంటారా అని ఇద్దరు నాయికల్ని అడిగితే వాళ్లూ ఊ ఊ అన్నారట. సుకుమార్‌ టీమ్‌ తొలుత ఐటెమ్‌ సాంగ్ కోసం నోరా ఫతేహీ, దిశా పటానీని సంప్రదించారని వార్తలొచ్చాయి. కానీ ఆఖరికి ఆ పాత్రలోకి సమంత వచ్చింది. ఇక సమంత అందం, డ్యాన్స్‌ ఆ పాటకు ఎలాంటి అదనపు ఫ్లేవర్‌ తెచ్చిందో మీకు తెలిసిందే.

సినిమాలో ఆఖరులో వచ్చినా… రెండో పార్టుకి కీలకంగా మారిన పాత్ర భన్వర్‌ సింగ్‌ షెకావత్‌. ఫహాద్‌ ఫాజిల్‌ పోషించిన ఈ పాత్రకు తొలుత మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతిని అనుకున్నారు. కానీ డేట్స్‌ సర్దుబాటు కాక ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత జిషూ సేన్‌ గుప్తాను కూడా అనుకున్నారు. కానీ ఆయనా ఓకే కాలేదు. నారా రోహిత్‌ పేరు కూడా వినిపించినా ఆఖరికి ఫహాద్‌ వచ్చాడు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus