Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

  • June 16, 2026 / 11:29 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

ఏ సినిమాకి అయినా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే దర్శకుడు అనే చెబుతుంటారు మన ఇండస్ట్రీ జనాలు. ఓ సినిమా రిజల్ట్ అనేది డైరక్షన్ పైనే ఆధారపడి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.  సినిమా హిట్ అయితే డైరెక్టర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. ఫ్లాప్ అయినా అంతే ప్రెజర్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ జాబ్ అంతా ఈజీ కాదు. నటీనటుల భవిష్యత్తు అంతా దర్శకుడిపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటిది నటీనటులు కూడా దర్శకులిగా(Actors Who Turned Directors) మారి సినిమాలు తీయడం అంటే చిన్న విషయం కాదు కదా.

Actors Who Turned Directors

1)నందమూరి తారక రామారావు : తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో గర్వంగా మాట్లాడుకునేలా చేసిన నటుల్లో విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు ఒకరు. అంత గొప్ప నటుడు దర్శకుడిగా కూడా మారి సినిమాలు తీశారు అనే సంగతి చాలా మందికి తెలీదు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించి చరిత్ర సృష్టించారు సీనియర్ ఎన్టీఆర్. ‘సీతారామ కళ్యాణం’ ‘గులేబకావళి కథ’ ‘శ్రీకృష్ణ పాండవీయం’ ‘వరకట్నం’ ‘తల్లా? పెళ్లామా?’ ‘తాతమ్మ కల’ ‘దాన వీర శూర కర్ణ’ ‘చాణక్య చంద్రగుప్త’ ‘శ్రీరామ పట్టాభిషేకం’ ‘అక్బర్ సలీం అనార్కలి’ ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ ‘సామ్రాట్ అశోక్’ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించి సంచలనం సృష్టించారు.

2) ఘట్టమనేని కృష్ణ : ‘డేరింగ్ అండ్ డాషింగ్’ అనే పదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా సూపర్ స్టార్ కృష్ణ గురించి చాలా మంది చెప్పుకుంటారు. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన… టాలీవుడ్ కు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కూడా పొందారు. నటుడిగా వందల సినిమాలు చేస్తూనే.. దర్శకుడిగా కౌబాయ్, జానపద, కమర్షియల్ చిత్రాలను ఆ రోజుల్లోనే ఎంతో స్టైలిష్‌గా, లావిష్ గా తెరకెక్కించారు. ‘సింహాసనం’ ‘శంఖారావం’ ‘ముగ్గురు కొడుకులు’ ‘కొడుకు దిద్దిన కాపురం’ ‘రిక్షావాలా’ ‘అన్నా తమ్ముడు’ ‘బాలచంద్రుడు’ ‘అల్లుడు దిద్దిన కాపురం’ ‘నాగాస్త్రం’ ‘ఇంద్రభవనం’ ‘రక్తతర్పణం’ ‘పండంటి సంసారం’ ‘ఇష్క్ హై తుమ్సే'(హిందీ) వంటి చిత్రాలను తెరకెక్కించారు.

3) విజయనిర్మల : అత్యధిక చిత్రాలను (ఏకంగా 44 సినిమాలు) దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తో స్థానం సంపాధించుకున్నారు. ఓ పక్క నటిగా మెప్పిస్తూనే దర్శకురాలిగా ఆమె అందించిన సూపర్ హిట్లు అన్నీ ఇన్నీ కావు అనే చెప్పాలి. ‘కవిత’ ‘మీనా’ ‘దేవదాసు’ ‘హేమాహేమీలు’ ‘అజాతశత్రువు’ ‘నేరము-శిక్ష’ ‘రామ్ రాబర్ట్ రహీమ్’ ‘పంచాయితీ’ ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ ‘శంఖుతీర్థం’ ‘కిలాడీ కృష్ణుడు’ ‘సంఘం చెక్కిన శిల్పాలు’ ‘భోగిమంటలు’ ‘రెండు కుటుంబాల కథ’ ‘పుట్టింటి గౌరవం’ వంటి క్రేజీ సినిమాలు తెరకెక్కించారు.

4)సావిత్రి : తన నటనతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టి ‘మహానటి’ ఇమేజ్ ని సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ సావిత్రి సైతం మెగాఫోన్ పట్టి ‘చిన్నారి పాపలు’ ‘మాతృ దేవత’ ‘వింత సంసారం’ ‘ప్రాప్తం’ ‘కుళందై ఉల్లం'(తమిళ్) వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు.

5) భానుమతి రామకృష్ణ : నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, రచయిత్రిగా… ఇలా అన్ని రంగాల్లోనూ తన నైపుణ్యం చాటుకున్న పి.భానుమతి డైరెక్టర్ గా కూడా మారి ‘చండీరాణి’ ‘ఇప్పడియుమ్ ఒరు పెణ్’ (తమిళ్) ‘భక్త ధ్రువ మార్కండేయ’ ‘అస్రాధ్యురాలు’ ‘విచిత్ర వివాహం’ ‘మనవడి కోసం’ ‘గృహలక్ష్మి’ ‘అంతా మన మంచికే’ వంటి చిత్రాలు తెరకెక్కించారు.

6)పవన్ కళ్యాణ్ :  పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభించిందే అసిస్టెంట్ డైరెక్టర్ గా..! కానీ తన అన్న బ్యాక్ గ్రౌండ్ తో హీరో అయ్యారు. తర్వాత తన టాలెంట్ తో స్టార్ గా ఎదిగారు.’జానీ’ అనే సినిమాని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేశారు అనే సంగతి ఇప్పటి జెంజీ కిడ్స్ కి ఎక్కువ తెలీదు అనే చెప్పాలి.ఆ సినిమాతో టాలీవుడ్ కి ఓ కొత్త మేకింగ్ స్టైల్ ని పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. సినిమా అయితే ఆడలేదు. కానీ టెక్నికల్ టీమ్ వర్క్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

7) ఎం ఎస్ నారాయణ : తన కామిడీతో తిరుగులేని స్టార్ గా ఎదిగిన ఎం ఎస్ నారాయణ మొదట్లో రైటర్ గా పనిచేశారు అనే సంగతి చాలా మందికి తెలీదు. ఆ తర్వాత దర్శకుడిగా కూడా మారి తన కుమారుడు విక్రమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘కొడుకు’ ‘భజంత్రీలు’ వంటి సినిమాలను తెరకెక్కించారు.

8) రామ్ పోతినేని : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంలో లిరిసిస్ట్ అవతారం ఎత్తాడు. సింగర్‌గా కూడా ఒకటి రెండు పాటలు పాడాడు. ఇప్పుడు డైరెక్టర్ గా మారి ఓ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించబోతున్నాడు. అది కూడా తన సొంత కథతో. ‘RAPO 23’ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

9)ఏ వి ఎస్ : తనదైన బాడీ లాంగ్వేజ్ తో నవ్వులు పూయించి ఓ తారాన్ని ఊపు ఊపిన హాస్య నటుడు ఏవిఎస్. తర్వాత ఆయన దర్శకుడిగా కూడా మారి ‘సూపర్ హీరోస్’ ‘ఓరి నీ ప్రేమ బంగారం కానూ’ ‘రూమ్‌మేట్స్’ వంటి చిత్రాలు డైరెక్ట్ చేశారు.

10) రాహుల్ రవీంద్రన్ : ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్.. దర్శకుడిగా మారి చిలసౌ సినిమాని డైరెక్ట్ చేశారు. ఆ సినిమాకి గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అటు తర్వాత ‘మన్మథుడు 2’ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి సినిమాలు కూడా డైరెక్ట్ చేశాడు.

11)పోసాని కృష్ణమురళి:  కెరీర్ ప్రారంభంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ, మాటలు అందించిన పోసాని.. ఆ తర్వాత నటుడిగా మారి తనదైన మార్క్ నటనతో పాపులర్ అయ్యారు. అదే సమయంలో దర్శకుడిగా కూడా మారి ‘శ్రావణమాసం’ ‘ఆపరేషన్ దుర్యోధన’ ‘ఆపద మొక్కులవాడు’ ‘మెంటల్ కృష్ణ’ ‘ఏ భైరవి చాపలచెరువు’ ‘దుశ్శాసన’ వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు.

12) జీవితా రాజశేఖర్ : సీనియర్ నటి జీవిత గారు కూడా తన భర్త రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేషు’ ‘సత్యమేవజయతే’ ‘మహంకాళి’ ‘శేఖర్’ వంటి చిత్రాలకి దర్శకత్వం వహించారు.

13) అడవి శేష్ : సక్సెస్ ఫుల్ హీరో అడివి శేష్ కూడా కెరీర్ ప్రారంభంలో ‘కర్మ’ ‘కిస్’ వంటి సినిమాలకి దర్శకత్వం వహించాడు.

14)అవసరాల శ్రీనివాస్ : తన నేచురల్ కామిడీతో అలరించే అవసరాల శ్రీనివాస్.. దర్శకుడిగా మారి ‘ఊహలు గుసగుసలాడే’ ‘జ్యో అచ్యుతానంద’ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ వంటి సినిమాలకి దర్శకత్వం వహించాడు.

15) విశ్వక్ సేన్ : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా మారి ‘ ‘ఫలక్‌నుమా దాస్’ ‘దాస్ కా ధమ్కీ’ ‘కల్ట్’ వంటి సినిమాలకి దర్శకత్వం వహించాడు.

16) వేణు ఎల్దండి : కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన వేణు.. ‘బలగం’ తో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ అనే సినిమాని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

17) వరలక్ష్మి శరత్‌కుమార్ : విలక్షణ పాత్రలతో మెప్పిస్తూ వస్తున్న వరలక్ష్మి శరత్‌కుమార్ మెగాఫోన్  పట్టి ‘ఎస్ సరస్వతి’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.

18) అభినయ కృష్ణ : కమెడియన్  అభినయ కృష్ణ (రఘు) సైతం దర్శకుడిగా మారి ‘చిరంజీవ’ వంటి సినిమాని డైరెక్ట్ చేశాడు. అలాగే ప్రస్తుతం ‘కామాఖ్య’ అనే సినిమాని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

19) వెన్నెల కిషోర్ : స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సైతం మెగాఫోన్ పట్టి.. ‘వెన్నెల 1 1/2’ ‘జఫ్ఫా’ వంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు.

20) ధనరాజ్ : ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులర్ అయిన వారిలో ధనరాజ్ ఒకరు. ఇతను దర్శకుడిగా కూడా మారి ‘రామం రాఘవం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.

21) రవిబాబు : చలపతి రావు తనయుడిగా సినిమాల్లో అడుగుపెట్టి.. కెరీర్ ప్రారంభంలో కొన్ని నెగిటివ్ రోల్స్ చేసి ఫేమస్ అయ్యాడు రవిబాబు. అటు తర్వాత దర్శకుడిగా కూడా మారి ‘అల్లరి’ ‘అమ్మాయిలు అబ్బాయిలు’ ‘సోగ్గాడు’ ‘నచ్చావులే’ ‘మనసార’ ‘అనసూయ’ ‘అమరావతి’ వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు.

 వీళ్లతో పాటు ఇప్పుడు కిరణ్ అబ్బవరం సైతం తన 13వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##UnrivalledTamilActors
  • #Actors
  • #Tollywood news

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

10 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

12 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

12 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

13 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

14 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

9 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

9 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

10 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

11 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version