Actress: ఆఖరికి నాన్న కూడా అలానే చూశాడు.. ఇదీ నా జీవితం!

బాలీవుడ్‌లో మోస్ట్‌ డిస్కస్‌డ్‌ అండ్‌ మోస్ట్‌ డిఫరెంట్‌ డ్రెస్‌డ్‌ సెలబ్రిటీ (?) ఎవరైనా ఉన్నారా? అంటే మగవాళ్లలో రణ్‌వీర్‌ సింగ్‌, ఆడవాళ్లలో ఉర్ఫీ జావెద్‌ అని చెప్పాలి. నిజానికి ఉర్ఫీ జావెద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హిందీ బిగ్ బాస్ ఓటీటీ షో ద్వారా పాపులర్ అయ్యింది. షో నుండి తొలిసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఆమె. ఆ ఇంట్లో చేసిందేమీ లేకపోయినా హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వివాదాలతో ఫేమస్ అయ్యింది. ఆమె డ్రెస్సులు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యాయి.

అయితే ఆమె ఆ డ్రెస్‌ల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా మారలేదు. దీంతో ఆమెను ట్రోల్‌ చేయడం, భయపెట్టడం లాంటివి చేశారు. వాటిని ఆమె ఎంతో ధైర్యంగా ఎదుర్కొని మరీ ముందుకెళ్తోంది. అయితే ఇటీవల ఆమె లైఫ్‌ గురించి ఓపెన్‌ అయ్యింది. దీంతో అయ్యో అంటూ నెటిజన్లు బాధపడుతున్నారు. బాల్యంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పిన ఉర్ఫీ.. 17 ఏళ్ల వయసులోనే ఇంట్లో నుండి పారిపోవాలనే నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి కూడా వివరించింది. దీంతో ఆమె మాటలు వైరల్‌గా మారాయి. 15 ఏళ్ల వయసులోనే ఉర్ఫీ ఫోటోలను పిఎన్ సైట్‌లో పెట్టేశారట.

దాంతో ఆమె (Actress) జీవితంలో సమస్య మొదలయ్యిందట. ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫొటోగా ఓ పిక్‌ అప్‌లోడ్ చేస్తే.. దాన్ని తీసుకొని ఎవరో పిఎన్ సైట్‌లో అప్‌లోడ్ చేసేశారట. ఆ విషయం అందరికీ తెలిసిపోయి.. తిట్టడం మొదలుపెట్టారట. ఆఖరికి ఆమెను పిఎన్ స్టార్ అని ప్రచారం చేశారట. ఈ క్రమంలో వాళ్ల నాన్న కూడా ఆమెను పిఎన్ స్టార్‌లా చూసేవాడట. ఆ తర్వాత పిఎన్ సైట్స్‌లో కలిసి పని చేయనని చెప్పడంతో ఇంట్లో వాళ్లు కొట్టేవారట. ఇలా ఇంట్లో రెండేళ్లు పరిస్థితులు భరించాక.. 17 ఏళ్ల వయసులో ఇంటి నుండి పారిపోవాలని నిర్ణయం తీసుకుందట ఉర్ఫీ.

అలా బయటకు వచ్చేసి లక్నో చేరుకుంది. పిల్లలకు ట్యూషన్ చెబుతూ.. వచ్చే డబ్బులతో ఇంటి అద్దె కట్టేదట. ఆ తరువాత అక్కడి నుండి ఢిల్లీకి వెళ్లింది. మిత్రుడి ఫ్లాట్ లో ఉంటూ కాల్ సెంటర్ ఉద్యోగం చేసింది. మళ్లీ కొన్ని రోజులకు అక్కడి నుండి ముంబయికి వెళ్లి టీవీ సీరియల్స్ కోసం ఆడిషన్ ఇచ్చిందట. అలా టీవీలో చిన్న చిన్న పాత్రలకు సెలెక్ట్ అయ్యింది. ఈ క్రమంలో పేరు తెచ్చకుంది. అప్పుడే బిగ్ బాస్ షో ఛాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత ఆమె విచిత్రమైన డ్రెస్సింగ్‌ ఇప్పుడు మనం చూస్తున్నాం.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus