‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది అదితి రావు హైదరి. ఈ చిత్రంలో తన సున్నిత మైన హావభావాలు కుర్ర కారుని బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ తో ‘అంతరిక్షం’ వంటి చిత్రంలో కూడా నటించింది. ఇప్పుడు నాని, సుధీర్ బాబు మల్టీ స్టారర్ చిత్రం ‘వి’ లో కూడా నటించబోతుంది. మధ్యలో మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన తమిళ చిత్రం ‘నవాబ్’ లో కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడికి డేటింగ్ ఎలా చేయాలో కూడా తెలీదంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిధి తన ప్రేమ గురించి అలాగే డేటింగ్ పై తన అభిప్రాయం గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అదితి మాట్లాడుతూ… “5వ తరగతి చదువుతున్నప్పుడే నా సీనియర్ ప్రేమలేఖ రాశాడు. అప్పుడు నా వయసు 9 సంవత్సరాలు. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసులో అతడు రాసిన రెండు పేజీల ప్రేమలేఖను తీసుకెళ్ళి గర్వంగా తన తల్లికి ఇచ్చాను. అయితే అంతే ఫాస్ట్ గా నన్ను బోర్డింగ్ స్కూల్ లో చేర్పించారు. నాకు 21 ఏళ్ళ వయసులో పెళ్ళి జరిగింది, ఎలా డేటింగ్ చేయాలో కూడా తెలీదు.” అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. అయితే ‘ఈమెది అమాయకత్వమా… ముక్కుసూటి తనమా’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.