క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసిన అదితీరావు హైదరి

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ అదితీ రావ్ హైదరీ తెలుగులో అడుగుపెట్టింది. తొలి చిత్రం తోనే అదరగొట్టింది. ఇప్పుడు వరుణ్ తేజ్ మూవీలో నటిస్తోంది. ఆమె తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను బాలీవుడ్ లో అవకాశాల కోసం తిరిగేటప్పుడు లైంగిక ఒత్తిడి ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. “చిత్ర పరిశ్రమలో అమ్మాయిలను ఎలా చూస్తారో తెలిసి కొన్నిసార్లు ఏడుపొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్‌ గురించి నాతో మాట్లాడినప్పుడు.. వారికెంత దైర్యం అని అడగాలనిపించేది. కానీ ఎదురు తిరిగి ప్రశ్నించలేక నో చెప్పాను. అందుకే 8 నెలలపాటు నాకు అవకాశాలు లేకుండా పోయాయి” అని చెప్పింది.

“చేతిలో ఏ సినిమా లేకున్నా నేను తీసుకున్న నిర్ణయం (క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా) నన్ను మరింత బలంగా తయారు చేసింది. ఇలా చిత్ర పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. అయితే వాటన్నింటినీ అధిగమించాను” అని హైదరి తెలిపింది. సినీ పరిశ్రమలో ఎంతమంది మాయ చేసినా.. వారి ప్రలోభాలకు లొంగవద్దని కొత్తనటీమణులకు సూచించింది. నిజంగా మనలో సత్తా ఉంటే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని దైర్యం చెప్పింది. ఇలా క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్స్ స్పందించడం మంచిదేననని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నుంచి ఎవరూ మోసపోకుండా ఆచితూచి అడుగులు వేస్తారని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus