Aishwarya Rai: బర్త్ డే స్పెషల్…ఐశ్వర్య రాయ్ ఎన్ని కోట్లకు అధిపతినో తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఒకరు. ప్రపంచ మాజీ సుందరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తాజాగా నేడు పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఇలా ఐశ్వర్య పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున ఈమెకు సినీ సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1973 నవంబర్‌ 1 న మంగళూరులో జన్మించింది ఐష్‌. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ముంబైకు షిఫ్ట్ అయింది.

మొదట మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఈ క్రమంలోనే 1994లో మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుంది. ఇలా సినిమా అవకాశాలను అందుకొని అనంతరం వరుసటి సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకొని బచ్చన్ కోడలుగా అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఈమె భారీగానే ఆస్తిపాస్తులను సంపాదించారు.

ఒక్కో సినిమాకు సుమారు 12 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకునే (Aishwarya Rai) ఐశ్వర్యరాయ్ ఎన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ మొత్తంలోనే ఆస్తిపాస్తులను కూడా పెట్టారని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం ఐష్‌ ఆస్తుల విలువ దాదాపు 800 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని సమాచారం. ఇలా ఆస్తిపాస్తులలో భాగంగా ముంబైలో బాంద్రాలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. దీని ధర సుమారు 21 కోట్ల రూపాయలు. వర్లీలో కూడా ఐశ్వర్యకు ఇల్లు కూడా ఉంది.

దీని ధర సుమారు 41 కోట్ల రూపాయలు. ఇక రోల్స్ రాయిస్ ఘోస్ట్, ఆడి A8L వంటి అనేక లగ్జరీ కార్లు గ్యారేజ్‌లో ఉన్నాయి. ఇక ఇవన్నీ కేవలం ఐశ్వర్య సంపాదించిన ఆస్తులు మాత్రమే అని చెప్పాలి. ఇక తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిపి ఈమెకు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ముంబైలో మాత్రమే కాకుండా దుబాయ్ ఇతర విదేశాలలో కూడా ఖరీదైన లగ్జరీ బంగ్లాలు కొనుగోలు చేయడమే కాకుండా పలు వ్యాపార రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus