టార్గెట్ 2020 పెట్టుకున్న హాట్ బ్యూటీ అమీ జాక్సన్

బికినీ మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన అమీ జాక్సన్ ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రసీమల్లో హాట్ పిక్. అమ్మడి డేట్స్ కోసం సూపర్ స్టార్ హీరోలు మొదలుకొని భారీ నిర్మాణ సంస్థల వరకూ కాపు కాచారు. రీసెంట్ గా “2.0”తో సూపర్ హిట్ అందుకున్న అమీజాక్సన్ తన పెళ్లి ఎప్పుడనేది ప్రకటించింది. కొన్నాళ్లుగా తన స్నేహితుడు మరియు టాప్ బిజినెస్ మేన్ అయిన జార్జ్ తో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని 2019 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా జనవరి 1న తన రిలేషన్ షిప్ ను పబ్లిక్ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు పెళ్లి తేదీని కూడా ప్రకటించింది. 2020లో పెళ్లి చేసుకోనున్నానని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. మరి పెళ్లి అనంతరం అమీ జాక్సన్ సినిమాలు కంటిన్యూ చేస్తాదా లేక పెళ్లి చేసుకొని తన సొంత దేశానికి పరిమితం అయిపోతుందా అనేది తెలియాల్సి ఉంది. 27 ఏళ్ల అమీ జాక్సన్ అప్పుడే పెళ్లి చేసుకోవడం వల్ల కెరీర్ పరంగా నష్టమే అని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. కొందరు మాత్రం పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో దూసుకుపోతున్న సమంతను చూపించి ఆమెలాగే ఈమె కూడా పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో సక్సెస్ అవుతుందిలే అంటున్నారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus