Actress: నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యాయత్నం చేసిందెవరంటే..?

భర్తపై హత్యాయత్నం చేసిన కేసులో నటిని (Actress)పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త చిత్ర పరిశ్రమ వర్గాల వారిని షాక్‌కి గురి చేస్తుంది.. వివరాల్లోకి వెళ్తే.. రమ్య తమిళ్ సీరియల్ ఆర్టిస్ట్.. సన్‌ టీవీలో వచ్చిన ‘సుందరి’ అనే సీరియల్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఇటీవల తన భర్తపై హత్యాయత్నం చేయించిన కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.. పోలీసు వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజులు క్రితం రమ్య తన భర్త రమేష్‌తో కలిసి బైక్‌ మీద బయటకు వెళ్లింది..

ఆ సమయంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి వీరి బండిని ఢీకొట్టాడు.. ఆ తర్వాత రమేష్‌ చేతులు, మెడ, తల మీద బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడి చేసి, అక్కడినుండి పరారయ్యాడు.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేష్‌ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ప్రస్తుతం చికిత్సనందిస్తున్నారు.. ఈ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. రమ్య, తన స్నేహితుడు చంద్రశేఖరన్‌తో కలిసి భర్తను చంపాలని ప్రయత్నించింది.. రమేష్‌ మద్యం సేవించి..

తనను తిట్టాడని అతడిని చంపాలని చంద్రశేఖరన్‌కి చెప్పింది.. ఈ ప్లాన్‌ గురించి వీరిద్దరూ మొబైల్‌లో మాట్లాడుకున్న మాటలు, మెసేజ్‌‌‌ల ద్వారా దొరికిపోయారు.. రమ్య, చంద్రశేఖరన్‌ మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపరిచారు.. ప్రస్తుతం వీరిని కోయంబత్తూరు సెంట్రల్‌ జైల్‌కు తరలించారు.. ఇక రమ్య, రమేష్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది.. వీరికి ఇద్దరు పిల్లలు.. కొన్ని నెలలుగా దంపతులు మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి..

దీంతో రమ్య భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది.. అప్పుడే ఆమెకు చంద్రశేఖరన్‌తో పరిచయం ఏర్పడింది.. ఇక రమ్యకు సినిమాల్లో రాణించాలని ఆశ.. చంద్రశేఖరన్‌ దాన్ని ఆసరాగా తీసుకుని.. ఆమెను స్టార్‌ నటిగా మారుస్తానని హామీ ఇచ్చాడు.. దాంతో అతడికి దగ్గరయ్యింది.. మరి చంద్రశేఖర్‌తో ఉండాలనే కారణంగానే రమ్య.. భర్తను హత్య చేయాలని భావించిందా?.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus