సల్వార్ కమీజ్ వేసుకొని స్విమ్మింగ్ చేయలేం కదా!

ఒక్కోసారి హీరోయిన్స్ ఇచ్చే సమాధానాల్లో చమత్కారంతోపాటు ఛీత్కారం కూడా కాస్త గట్టిగా కనిపిస్తుంటుంది. మొన్న అనీషా ఆంబ్రోస్ అదే విధంగా రెస్పాండ్ అయ్యింది. “ఒక్కడు మిగిలాడు” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన అనీషా ఆంబ్రోస్ సినిమా విశేషాలు చెబుతుండగా.. ఓ మీడియా ప్రతినిధి “మీ బికినీ ఫోటోలు వైరల్ అయ్యాయి కదా.. వాటి గురించి మీ స్పందన ఏమిటి?” అని అడిగాడు. వెంటనే ఆలోచించకుండా అనీషా “మాల్దీవుల్లో సముద్రంలో స్నానం చేసేప్పుడు సల్వార్ కమీజ్ వేసుకోలేము కదా.. సో బికినీ వేసుకొన్నాను.. అందులో తప్పేముంది. అయినా ఆ ఫోటోలు చూసి తప్పుబట్టేవాళ్లని నేను పట్టించుకోను” ఆంటూ కాస్త ఘాటుగా సమాధానమిచ్చిన అనీషా.. అదే సందర్భంలో “ఏంటీ ప్రశ్నా.. సినిమా గురించి మాత్రమే అడగండి” అంటూ చిన్న సంజ్ణ కూడా చేసిందట. దాంతో ఇంకా వేరే ప్రశ్నలు అడుగుదామనుకొన్నవారందరూ మిన్నకుండిపోయారట.

ఇకపోతే.. తెలుగులో ప్రస్తుతం ఒక సీక్రెట్ ప్రోజెక్ట్ చేస్తున్న అనీషా తమిళంలో ఒక కొత్త హీరోతో సినిమా చేసింది. అలాగే.. మరో తమిళ సినిమా కూడా సైన్ చేసిందట. ఇకపై తెలుగులో కథానాయికగా నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తానని అనీషా తెలిపింది. పాపం ఇప్పటివరకూ ఆరేడు సినిమాల్లో నటించడమే కాక లిప్ లాక్స్, గ్లామ్ షోకి ఏమాత్రం మొహమాటం చూపకపోయినా ఇప్పటివరకూ అమ్మడికి ఎందుకని సరైన ఆఫర్లు రాలేదో ఆమెకే అర్ధం కాలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus