యూట్యూబ్‌ లో పనికిమాలిన వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారు: నటి అంజలి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న ‘లాకప్’ షో .. బాలీవుడ్లో పెద్ద ఎత్తున హాట్ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఎందుకంటే ఇందులో పాల్గొనే సెలబ్రిటీల జీవితాల్లో ఉన్న చేదు అనుభవాలను బయటపెడుతోంది ఈ షో. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ జీవితాల్లో ఎదురైన చీకటి కోణాలను వివరించి వార్తల్లో నిలిచారు. ఈ షో ద్వారా పాపులర్ అయిన వారిలో కుర్ర నటి అంజలి అరోరా కూడా ఒకరు.

సోషల్ మీడియాలో 10 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగిన ఈ నటి ఇటీవల ‘సైయా దిల్ మే ఆనా రే’ అనే ప్రైవేట్ సాంగ్ లో ఆడిపాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వీడియో ఈమెకు చిక్కుల్లో పడేసింది. మేటర్ లోకి వెళితే.. ఇటీవల ‘అంజలి ఎంఎంఎస్’ అనే ఓ వీడియో సాంగ్ తెగ వైరల్‌ అయ్యింది. కానీ అందులో ఉన్నది నేను కాదు అంటూ అంజలి ఎమోషనల్ అయ్యింది. ఆ వీడియో చూసిన చాలా మంది జనాలు అంజలి పై ఘోరమైన కామెంట్లు చేశారట. దీనిపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అంజలి మాట్లాడుతూ.. “ఎవరి ఫ్యామిలీలో అయినా ఇలా జరిగితే వారు ఎంత బాధాపడతారో తెలుసా? ఇలా జరగడం ఫస్ట్ టైమ్ కాదు. ఈ విషయంపై ఇప్పటికే నా తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం జరిగింది. సిద్ధార్థ్ కన్నన్‌ తో ఉన్న వీడియోకి నా పేరు, నా ఫోటో పెట్టి.. అది ‘అంజలి అరోరా MMS’ అంటూ ప్రచారం చేశారు.అసలు అలా ఎందుకు ప్రచారం చేశారో నాకు తెలీదు. ఇలా చేసేవారికి కూడా ఓ కుటుంబం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.

నాకు కూడా మీలా ఓ కుటుంబం ఉంటుంది అని మీరు ఒక్క నిమిషమైనా ఆలోచిస్తే ఇలా చేయరు. యూట్యూబ్‌ లో పనికిమాలిన వ్యూస్ కోసం, అది అంజలి అరోరా ఎంఎంఎస్ అంటూ ప్రచారం చేశారు. అలా చేయడం కరెక్ట్ కాదు. నాకు కూడా ఓ ఫ్యామిలీ ఉంది,నాకు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ‘లాకప్‌’ షో నుండి బయటకి రాకముందు కూడా ఇలాగే జరిగింది.నా వయసు కేవలం 21 ఏళ్ళు మాత్రమే, ఇలాంటివన్నీ తట్టుకోగలిగే శక్తి నాకు లేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఈ యువ నటి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus