తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై స్పందించిన అంజలి

బొద్దుగుమ్మ అంజలి గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది. ఆమె కృషి ఫలించి ఇప్పుడు పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలున్నాయి. అలాగే ఆమె మలయాళంలో మమ్ముట్టితో కలిసి నటించిన “పెరంబు” మంచి హిట్ అవ్వడం, ప్రస్తుతం విజయ్ సేతుపతి, శశికుమార్ వంటి తమిళ స్టార్ హీరోలతో వరుస సినిమాలు కూడా ఉండడంతో.. నిన్నటిమొన్నటి వరకూ అంజలిని పట్టించుకోవడం మానేసిన గాసిప్పు రాయుళ్ళు మళ్ళీ ఆమెపై దృష్టి సారించడం మొదలెట్టారు.

మొన్నటివరకూ అంజలి తమిళ నటుడు జైతో డీప్ రిలేషన్ లో ఉండడం అనంతరం అది బ్రేక్ అవ్వడం తెలిసిందే. అందుకే.. ఆమె సరిగ్గా ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న టైమ్ చూసి అంజలికి పెళ్లి ఫిక్స్ అయ్యింది అంటూ పెళ్లి డేట్ & ముహూర్తంతో సహా ప్రకటించేశారు. అయితే.. ఇదివరకట్లా గాసిప్పులను లైట్ తీసుకోకుండా వెంటనే స్పందించిన అంజలి నేనేమీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. ఆ ఆలోచన కూడా లేదు. ప్రస్తుతానికి నా కెరీర్ బాగుంది, అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకొంటాను అని రివర్స్ లో క్వశ్చన్ చేసింది. సొ, అంజలి అప్పుడే పెళ్లి చేసుకోవడం లేదన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus