Anjali: వామ్మో.. సినిమాలు లేకపోయినా అంజలి ఇన్ని ఆస్తులు కూడపెట్టిందా..!

అంజలి షాపింగ్ మాల్ సినిమా ద్వారా పరిచయం అయింది. తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించారు. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్నారు. అంజలి అసలు పేరు బాల త్రిపుర సుందరి. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంజలిగా పేరు మార్చుకున్నారు. ఇక అంజలి ఆస్తుల విషయానికి వస్తే.. చెన్నైతో పాటు హైదరాబాద్ లోనూ ఆమె సంపాదించిన ఆస్తుల విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని టాక్. అయితే ఆస్తుల విషయంలో ఆమె కుటుంబ సభ్యులతో గొడవ పడిన సంగతి తెలిసిందే.

అంజలి (Anjali) ఒక్కో సినిమాకు రూ.80 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారట. ఇక్కడ మరో విషయం ఏమంటే.. అంజలి చాలా కాలంగా సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా అటు తమిళ్‌ లేదా ఇటు తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదగలేకపోయారు. అయితే ప్రస్తుతం మాత్రం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన తెలుగందం అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది. హోమ్లీ పాత్రలతో సౌందర్య లేని లోటు తీర్చింది.

ఈ అమ్మడు ఆ మధ్య విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలో జరీనా పాత్రలో అద్భుతమైన నటన చూపించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమా మంచి విజయవంతం కావడంతో అంజలికి వరుస అవకాశాలు వచ్చాయి.

ఈ సినిమా తర్వాత గీతాంజలి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్రమంగా అంజలికి ఇటు తెలుగులో, అటు తమిళంలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక ఈ అమ్మడికి ఆస్తులు కూడా బాగానే ఉన్నట్లు సమాచరం. మొత్తం కలిపి రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలానే లగ్జరీ కారు కూడా ఉందట. అలానే రెండు ప్యాలెస్లు కూడా ఉన్నాయిట.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus