Ankitha: సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ అంకిత!

చేసింది కేవలం రెండు మూడు సినిమాలే అయినా, ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని స్థానం ని దక్కించుకున్న హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు అంకిత. ఈమె ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రం ద్వారా మన టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఈమెకి అవకాలు భారీ గా క్యూ కట్టాయి.

ఈ చిత్రం తర్వాత ఆమె ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇలా చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతూ ఉండడం తో అంకిత కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఒక పక్క యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూనే, మరో పక్క స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలను సంపాదిస్తూ క్రేజీ హీరోయిన్ గా మారింది.

కానీ మధ్యలో ఫ్లాప్స్ తగిలాయి, హీరోయిన్ అవకాశాలు చిన్నగా తగ్గుతూ వచ్చాయి. ఇక సినిమాలు చాలు అనుకొని పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడిపోయింది. రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నేను బాలకృష్ణ గారితో చేసిన ‘విజయేంద్ర వర్మ’ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకున్నాను.

ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడం మీదనే నా కెరీర్ ఆధారపడి ఉంది.కానీ ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది, నాకు ఆ సినిమా దెబ్బకి అవకాశాలు రావడం కూడా ఆగిపోయాయి. అలా నా కెరీర్ పోయింది, ఇందులో వింతేమీ లేదు, ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఒక హీరోయిన్ మనుగడ సాధించాలి అంటే కచ్చితంగా సక్సెస్ ఉండాలి, లేకుంటే ముందుకు సాగలేం’ అంటూ ఆమె (Ankitha) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus