‘అఆ’ ‘ప్రేమమ్’ వంటి చిత్రాలతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది అనుపమ పరమేశ్వరన్. ఈ రెండు చిత్రాలలోనూ మెయిన్ హీరోయిన్ కాకపోయినా తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అనుపమ. ఇక ‘శతమానం భవతి’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలతో కుర్రకారుని కూడా ఆకర్షించింది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం ప్లాప్ అయినా… ‘అనుపమ ఉన్నంత వరకూ సినిమా బోర్ కొట్టదు’ అనే ప్రశంసను మాత్రం సొంతం చేసుకుంది. చూడ్డానికి నేచురల్ బ్యూటీ లా కనిపిస్తూ… తెలుగు రాకపోయినా వెంటనే నేర్చుకుని తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంటూ… తన ప్రత్యేకతని చాటుకుంటూ వచ్చింది. ‘మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్’ అనుపమ అనడంలో సందేహమే లేదు.
అయితే ఇవన్నీ ఉన్నా గ్లామర్ డోస్… ఇవ్వకపోవడం వలనో ఏమో అనుపమ పరమేశ్వరన్ కి పెద్ద అవకాశాలు రావడం లేదు.ముఖ్యంగా గతేడాది చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రాలు అనుపమ కెరీర్ ని బాగా దెబ్బ తీశాయి. మధ్యలో వచ్చిన ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం పర్వాలేదనిపించినా… అనుపమకు పెద్దగా ఉపయోగ పడలేదు. దీంతో ఇప్పుడు కన్నడ చిత్రసీమ బాటపట్టింది అనుపమ. ఇక కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ సరసన ‘నటసార్వభౌమ’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది అనుపమ. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని పునీత్ కు ఉన్న స్టార్ డమ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. దీంతో .. అనుపమ కన్నడ డెబ్యూ హిట్ అనే చెప్పొచ్చు. సో.. ఈ చిత్ర విజయంతో అనుపమకి మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పడంలో సందేహం లేదు. మరి అనుపమ కన్నడంలో తన జర్నీని కొనసాగిస్తుందో లేదో చూడాలి.