Anushka Cars: స్వీటీ కార్ల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

  • June 24, 2022 / 06:23 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క గత కొన్ని నెలలుగా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. అనుష్క కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు వెలువడుతున్నా ఆమె షూటింగ్ లో మాత్రం పాల్గొనడం లేదు. పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు ఉన్న అనుష్క కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అనుష్క ఇకపై పరిమితంగానే సినిమాలలో నటిస్తారని సమాచారం అందుతోంది. అయితే అనుష్క దగ్గర ఖరీదైన కార్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయని సమాచారం అందుతోంది.

అనుష్క శెట్టి దగ్గర బీఎండబ్ల్యూ 6 సిరీస్ కారు ఉందని ఈ కారు విలువ 70 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని బోగట్టా. అనుష్క దగ్గర ఉన్న కార్లలో ఆడి ఏ6 ఒకటి కాగా ఈ కారు విలువ 60 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది. కార్లను ఇష్టపడే టాలీవుడ్ సెలబ్రిటీలలో అనుష్క ఒకరు. అనుష్క దగ్గర ఆడి క్యూ5 కారు కూడా ఉంది. ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఈ కారు విలువ 59 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం.

ఈ కార్లతో పాటు అనుష్క దగ్గర టయోటా కరోలా ఆల్టిస్ కారు ఉంది. సినిమాల్లో హీరోయిన్ అయిన తర్వాత అనుష్క కొనుగోలు చేసిన మొదటి కారు ఇదేనని తెలుస్తోంది. అనుష్క దగ్గర ఉన్న మొత్తం కార్ల విలువ 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. సినిమాల ద్వారా అనుష్క ఊహించని స్థాయిలో డబ్బు సంపాదించారని సమాచారం.

అనుష్క వరుస సినిమాలతో బిజీ కావాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తే బాగుంటుందని మరి కొందరు భావిస్తున్నారు. అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus