Charmee Kaur: బర్త్ డే సందర్బంగా చార్మి చేసిన ఆసక్తికర పోస్ట్ వైరల్!

టాలీవుడ్ లో చార్మి గ్లామర్ మెరుపులు మెరిపించిన నటి. తన అందాలతో కుర్రకారుని ఒకప్పుడు ఉర్రూతలూగించింది. నీతోడు కావాలి అంటూ 2002లో సినీ ప్రపంచంలో అడుగు పెట్టిన పంజాబీ భామ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో 60 కి పైగా చిత్రాల్లో నటించింది. నటిగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించిన ఈ బొద్దుగుమ్మ.. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు దగ్గరైన చార్మి నిర్మాతగా మారి సినిమాలు చేస్తోంది.

లాస్ట్ ఇయర్ ఛార్మీ (Charmee Kaur) నిర్మాతగా లైగర్ అనే సినిమా అందరి అంచనాలు తలకిందలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇపుడు రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.అయితే లైగర్ తలనొప్పులు పూరి-ఛార్మిలను ఇంకా వదల్లేదు. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నైజాం ఎగ్జిబిటర్స్, లీజర్స్ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. లైగర్ నష్టాల్లో కొంత మొత్తం తిరిగి చెల్లించాలని నిరసన చేస్తున్నారు.

మొత్తంగా రూ. 9 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టెన్షన్స్ మధ్యే ఛార్మి బర్త్ డే వేడుకలు జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. నచ్చిన ప్రదేశాన్ని వెళ్ళండి, నచ్చిన వాళ్ళను ప్రేమించండి, ఆనందంగా జీవించండి… కానీ ఎవరికీ చెప్పొద్దు. జనాలు నాశనం చేస్తారు, అని కామెంట్ పెట్టారు. ఛార్మి పోస్ట్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో యంగ్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, నితిన్ సరసన మెరిసిన అందాల ఛార్మి.

తెలుగులో చిరంజీవి తప్ప మిగిలిన సీనియర్ టాప్ హీరోలైన బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ సరసన నటించిన ఛార్మి. ‘మంత్ర’ సినిమాలోని నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్న ఛార్మి కౌర్. ‘మంగళ’ సినిమాలోని నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న ఛార్మి కౌర్.తెలుగులో ‘జ్యోతి లక్ష్మి’ ‘మంగళ 2’ వంటి లేడీ లేడి వరేండియల్ సినిమాలు చేశారు. అయితే ప్రసుత్తం నిర్మాతగా కొనసాగుతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus