టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో డింపుల్ హయాతి ఒకరు. డింపుల్ హయాతి నటించిన రామబాణం సినిమా కొన్నిరోజుల క్రితం థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కథల ఎంపికలో డింపుల్ మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా డింపుల్ హయాతిపై తాజాగా క్రిమినల్ కేసు నమోదైంది.
ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డింపుల్ పై కేసు నమోదు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే డింపుల్ తరపు న్యాయవాది పాల్ సత్యనారాయణ ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. డింపుల్ పై కావాలనే తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. రాహుల్ హెగ్డే డింపుల్ తో చాలాసార్లు ర్యాష్ గా మాట్లాడారని ఆయన చెప్పుకొచ్చారు.
డింపుల్ కారు పార్కింగ్ ప్లేస్ లో డీసీపీ కోన్స్ పెట్టారని ప్రైవేట్ అపార్ట్మెంట్ లోకి రోడ్డుపై ఉండే సిమెంట్ బ్రిక్స్ ఎలా వచ్చాయని లాయర్ ప్రశ్నించారు. ఈ విషయం గురించి రెండు నెలలుగా అడుగుతున్నామని తాము లీగల్ గా పోరాటం చేస్తామని లాయర్ వెల్లడించడం గమనార్హం. డీసీపీపై డింపుల్ కేసు పెడతానని బెదిరించడంతో తిరిగి ఆమెపైనే కేసు పెట్టారని లాయర్ పేర్కొన్నారు.
(Dimple Hayathi) డింపుల్ ను వేధించడమే డీసీపీ ఉద్దేశం అని క్వార్టర్ లో ఉండకుండా డీసీపీ ప్రైవేట్ అపార్ట్మెంట్ లో ఎందుకు ఉంటున్నారని లాయర్ ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రాపర్టీని మిస్ యూజ్ చేస్తున్నారని లాయర్ పాల్ సత్యనారాయణ అన్నారు. డింపుల్ ఫిర్యాదు చేసినా తీసుకోలేదని 4 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని ఈ కేసులో లీగల్ గా ఫైట్ చేస్తామని లాయర్ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు