ప్రముఖ సీనియర్ హీరోయిన్ నర్మద.. మరియు ఆమె 15 ఏళ్ళ కూతురు… కనబడకుండా పోవడంతో తమిళ్ ఇండస్ట్రీ మొత్తం ఆందోళనకు గురవుతుంది. దీంతో ఆమె భర్త మరియు ఆమె కుటుంబసభ్యులు తారాపురం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ‘ఆమె మిస్ అయ్యిందా లేక ఎవరైనా కిడ్నప్ చేసారా?’ అనే విషయం పై కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే కచ్చితంగా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలి.
అది గ్లామర్ తో అయినా సరే లేదా నటనతో అయినా సరే..! అలా జరిగితే సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా హీరోయిన్ కు వరుస ఆఫర్లు వస్తాయి లేదంటే రావు.! అయితే ఎందుకో ఏమో కొంతమంది హీరోయిన్లు మొదటి సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ మరో సినిమా చెయ్యకుండా మాయమైపోతుంటారు. బహుశా అది వారి పర్సనల్ రీజన్స్ వల్ల కావచ్చు. అదే కోవలోకి వస్తుంది సీనియర్ హీరోయిన్..నర్మద. 1987 లో వచ్చిన ‘చిన్న పూవే మెల్ల’ అనే తమిళ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నర్మద. అప్పటి క్రేజీ హీరోలు అయిన రాంకీ మరియు ప్రభు.. ఈ చిత్రంలో హీరోలుగా నటించారు.
సినిమా సూపర్ హిట్ అయ్యింది. నర్మద నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆమెకు వరుస ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఎందుకో ఆమె మరో సినిమాలో నటించలేదు. తమిళనాడులోని తారాపురం కు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఇన్నేళ్ళలో ఈమె గురించి ఒక్క వార్తా లేదు. కానీ ఇప్పుడు ఈమె మిస్ అవ్వడంతో.. ఈమె గురించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.