గతంలో ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా ప్రశంసలు అందుకున్న తమిళ స్టార్ దర్శకుడు శంకర్… ఇప్పుడు ఆల్మోస్ట్ ఫేడౌట్ దశకు చేరుకున్నాడు అనే విమర్శలు మూటగట్టుకున్నాడు. తన ఆస్థాన రైటర్ సుజాత మరణించిన తర్వాత శంకర్ ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. ‘ఐ’ ‘ఇండియన్ 2’ ‘గేమ్ ఛేంజర్’ అన్నీ డిజాస్టర్లే. ‘2.ఓ’ కూడా కమర్షియల్ గా ప్లాప్. అందుకే ఇతను తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఇప్పుడు టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు శంకర్ కి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ లేదు.
మరోపక్క ‘ఇండియన్ 3’ కూడా పూర్తి చేయాలి. సో ఇప్పట్లో శంకర్ కోలుకోవడం కష్టమే. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. శంకర్ తనయుడు హీరోగా డెబ్యూ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఆల్రెడీ శంకర్ కూతురు అధితి శంకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ‘మహావీరుడు’ ‘భైరవం’ వంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు శంకర్ తనయుడు అర్జిత్ శంకర్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కొన్నేళ్లుగా ఇతను నటనలో శిక్షణ పొందుతున్నాడట.స్టార్ డైరెక్టర్ అట్లీ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఓ టాలెంటెడ్ కుర్రాడు అర్జిత్ శంకర్ డెబ్యూ మూవీని తెరకెక్కించబోతున్నారు అని తెలుస్తుంది. శంకర్ కథలో మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ ఫైనల్ చేశారట. ‘ఫ్యాషన్ స్టూడియోస్’ నిర్మించబోతున్న ఈ సినిమా దసరా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.