విజయ్ దేవరకొండ,దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ‘కింగ్డమ్’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.
జూలై 31న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. అందువల్ల వీకెండ్ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ బాగా డల్ అయ్యాయి. దీంతో 2వ వీకెండ్ పై గట్టిగా ప్రెజర్ పడింది. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 11.03 cr |
సీడెడ్ | 4.23 cr |
ఉత్తరాంధ్ర | 3.22 cr |
ఈస్ట్ | 1.92 cr |
వెస్ట్ | 1.09 cr |
గుంటూరు | 1.55 cr |
కృష్ణా | 1.31 cr |
నెల్లూరు | 0.87 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 25.22 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.64 cr |
మిగిలిన వెర్షన్లు | 0.67 cr |
ఓవర్సీస్ | 9.10 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 39.63 cr (షేర్) |
‘కింగ్డమ్’ చిత్రానికి రూ.50.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.52 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజుల్లో ఈ సినిమా రూ.39.63 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.73.6 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.12.37 కోట్లు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. 2 వ వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ‘అతడు’ రీ రిలీజ్ హవా ఎక్కువగా నడుస్తున్న నేపథ్యంలో అది అంత ఈజీ కాదు అని కూడా చెప్పాలి.