Divya Bharti: ఆ 8 మంది హీరోయిన్స్ స్టార్లులు అవ్వడానికి నా కూతురే కారణం: దివ్యభారతి తల్లి

ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకోవడమా అనేది సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు మనం అలాంటి హీరోయిన్స్ ని చాలా మందిని చూస్తున్నాం, కానీ ఆరోజుల్లో ఇలా కాదు , ఒక హీరోయిన్ కి స్టార్ స్టేటస్ రావాలంటే చాలా సమయం పట్టేది. అలాంటి రోజుల్లో కూడా ఒక అమ్మాయి, చిన్న వయస్సులో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తెలుగు హిందీ , తమిళం భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సినిమాల్లో నటించి, హిట్టు మీద హిట్టు కొడుతూ సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది.

ఆమె మరెవరో కాదు, (Divya Bharti) దివ్య భారతి. తెలుగు ఈమె ఆరోజుల్లో చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున మరియు వెంకటేష్ వంటి హీరోలతో కలిసి నటించి మంచి సక్సెస్ లను అందుకుంది. అలా కెరీర్ లో ఎవ్వరూ అందుకొని రేంజ్ కి వెళ్తున్న సమయం లో తన అపార్ట్మెంట్స్ ఫ్లోర్ నుండి జారీ క్రింద పడిపోయి చనిపోయిన ఘటన యావత్తు సినీ పరిశ్రమని శోక సంద్రం లోకి నెట్టేసింది. ఇకపోతే రీసెంట్ గా దివ్య భారతి చనిపోయిన ఆతర్వాత జరిగిన కొన్ని సంఘటనల గురించి సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది.

ఆమె చనిపోక ముందు బాలీవుడ్ లో దాదాపుగా 12 సినిమాల్లో నటించేందుకు సంతకాలు చేసింది. కానీ అకస్మాత్తుగా ఈ దురదృష్టకరమైన సంఘటన జరగడం కారణం గా ఆమె బదులు వేరే హీరోయిన్స్ ని తీసుకున్నారు దర్శక నిర్మాతలు. కరిష్మా కపూర్, శ్రీదేవి, రవీనా టాండన్, టబు, మమతా కులకర్ణి, జుహీ చావ్లా , కాజోల్, పూజ భట్ వంటి హీరోయిన్స్ దివ్య భారతి చెయ్యాల్సిన సినిమాలు చేసారు.

ఈ సినిమాలన్నీ కూడా వాళ్ళ కెరీర్స్ ని మలుపు తిప్పాయి, భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. వీళ్ళు పైకి ఎదిగేందుకు కోసమే నా బిడ్డ చనిపోయిందా అని దివ్య భారతి తల్లి అప్పట్లో పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటూ వాపోయేదట. దివ్య భారతి ఇండస్ట్రీ లో ఉన్న రోజుల్లో ఈ హీరోయిన్స్ అందరికీ సినిమాల్లో అవకాశాలు లేకుండా ఉండేవి. దివ్య భారతి కాల్ షీట్స్ దొరకకపోతే వీళ్ళ వైపు చూసేవాళ్ళు దర్శక నిర్మాతలు. అలా స్థాయి ఉన్న దివ్య భారతి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus