Ester: రూటు మార్చి… డైరెక్టర్ గా మారిన హీరోయిన్ ఎస్తర్!

Advertisement

ఎస్తర్ నోరోన్హా అందరికీ సుపరిచితమే. తేజ దర్శకత్వంలో రూపొందిన ‘1000 అబద్దాలు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సునీల్ సరసన భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు. తర్వాత ఈమె సింగర్ నోయల్ సేన్ ను పెళ్లి చేసుకుంది. తర్వాత ఏడాదికే వీళ్లు విడాకులు తీసుకోవడం జరిగింది. అటు తర్వాత ఈమె ఒకటి రెండు గ్లామర్ సినిమాల్లో నటించింది.

ఇప్పుడు రూటు మార్చి… నిర్మాతగా , దర్శకురాలిగా, మారుతుంది అని చెప్పాలి. అది కూడా ఒక పాన్ ఇండియా చిత్రంతో. వివరాల్లోకి వెళ్తే… ఎస్తర్ ‘ది వేకెంట్ హౌస్’ అనే చిత్రంలో నటించింది.జానెట్ నోరోన్హా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ఎస్తర్ నోరోన్హా తల్లి జానెట్ నోరోన్హా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఎస్తర్ రచనా,దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందిస్తున్నారు. అయితే ఈ సినిమాతో తాను దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఆద్యాంతం ప్రేక్షకలను అలరించే సబ్జెక్ట్ ఉండడంతో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ భాషాల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఇక గతంలో జానెట్ నొరోన్హా ప్రొడక్షన్స్ “సోఫియా” ఏ డ్రీమ్ గర్ల్ అనే కొంకణి మూవీని నిర్మించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో ఎస్తర్ కి ఎలాంటి రిజల్ట్ ను సాధిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. చూడాలి మరి

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus