Faria Abdullah: బెల్లీ డ్యాన్స్‌తో ఆకర్షించిన జాతిరత్నాలు బ్యూటీ ఫారియా అబ్దుల్లా.. వైరల్ అవుతున్న వీడియో..!

Advertisement

గతేడాది నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా వచ్చిన ‘జాతి రత్నాలు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఫ‌రియా అబ్దుల్లా. ఈ చిత్రంలో చిట్టి పాత్రలో ఆమె చాలా క్యూట్ గా నటించింది అనే చెప్పాలి. అమాయకత్వంతో నిండిన లాయర్ పాత్రలో నవ్వులు కూడా పూయించింది. చూడటానికి చక్కగా ఉండే ఈమె మంచి హైట్‌ కూడా… .! ఓ రకంగా ఈమెకు హైట్ మైనస్ అయ్యింది అని చెప్పాలి. ఎందుకంటే ‘జాతి రత్నాలు’ క్రేజ్ తో ఈమెకు వచ్చిన క్రేజ్ తో వరుస అవకాశాలతో బిజీ అయిపోతుంది అని అంతా అనుకున్నారు.

కానీ అలా ఏమీ జరగలేదు.’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ‘బంగార్రాజు’ వంటి సినిమాల్లో ఈమెకు అవకాశాలు వచ్చాయి కానీ అందులో ఈమెవి ఏమాత్రం గుర్తింపు లేని పాత్రలు. ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న ‘రావ‌ణాసుర’ లో కూడా నటిస్తుంది. అందులో కూడా ఈమెది పెద్ద ప్రాముఖ్యత లేని పాత్ర అని వినికిడి. విష్ణు- శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఢీ అండ్ ఢీ : డబుల్ డోస్’ అనే చిత్రంలో ఛాన్స్ వచ్చింది కానీ.. ఆ సినిమా పరిస్థితి ఏంటో ఎవ్వరికీ తెలీదు.

తాజాగా ఫ‌రియా అబ్దుల్లా బెల్లీ డాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాభి అందాల‌ను చూపిస్తూ ఈ అమ్మ‌డు చేసిన డాన్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus