Geetha Singh: సొంత వాళ్ల చేతిలోనే కోట్ల రూపాయలు నష్టపోయాను.. ఆవేదన వ్యక్తం చేసిన గీతా సింగ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్లుగా గుర్తింపు పొందిన వారిలో గీతా సింగ్ కూడా ఒకరు. చూడటానికి లావుగా ఉన్నా కూడా తన కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఎన్నో సినిమాలలో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన గీతా సింగ్ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఎక్కడ కనిపించటం లేదు. అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో అల్లరి నరేష్ భార్యగా నటించిన గీతా సింగ్ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది.

ఆ తర్వాత ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలలో నటించి ప్రేక్షకుల్ని నవ్వించిన కొంతకాలంగా ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన గీతా సింగ్ తన వ్యక్తిగత విశేషాల గురించి వెల్లడించి కన్నీటి పర్యంతమయింది. ఈ క్రమంలో గీత సింగ్ మాట్లాడుతూ.. ఇంతకాలం కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర చిట్టీలు వేసి పోగొట్టుకున్నానని తెలిపారు.

నమ్మిన వారే కదా అని తన దగ్గర చిట్టి వేసి సుమారుగా 6 కోట్ల వరకు నష్టపోయానని తన బాధ చెప్పుకుంది. తన వద్ద డబ్బు ఉన్నంతకాలం కుటుంబ సభ్యులు, స్నేహితులు తనని బాగా వాడుకొని డబ్బులు లేని సమయంలో ఎవరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లేడీ కమెడియన్లకు అవకాశాలు ఇవ్వడం లేదని కేవలం మగవారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పుకొచ్చింది.

ఇలా సినిమాలలో అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ జీవితం మీద విరక్తి కలిగి రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. అయితే ఆమె స్నేహితురాలు చూసి కాపాడటంతో బ్రతికి బయటపడినట్లు వెల్లడించింది, ఇండస్ట్రీలో కూడా ఎలాంటి అవకాశాలు లేక జీవనం కొనసాగించడం కూడా కష్టతరంగా మారిందని ఈమె తెలిపారు. ప్రస్తుతం తన స్నేహితురాలే తనకు అండగా నిలిచిందని గీతా సింగ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus