Hema Arrusted Video: హేమ అరెస్ట్.. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్.. వీడియో వైరల్!

  • June 4, 2024 / 08:37 AM IST

మే 20 న బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో కొంతమంది టాలీవుడ్ నటీనటులు పట్టుబడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు రాగా ఆమె.. ఓ వీడియో రిలీజ్ చేసి తన హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నట్లు చెప్పింది. కానీ ఆ వెంటనే బెంగళూరు పోలీసులు హేమ కూడా పట్టుబడిన వారి లిస్ట్ లో ఉందని, రేవ్ పార్టీలో ఆమె కూడా పాల్గొందని తెలిపి ఆమెకు పెద్ద షాకిచ్చారు. అయినా సరే తర్వాత రోజు తన ఇంట్లో నుండి చికెన్ బిర్యానీ చేస్తున్నట్టు ఇంకో వీడియో షేర్ చేసింది.

అయినప్పటికీ బెంగళూరు పోలీసులు తగ్గకుండా రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్.. రిపోర్ట్స్ లో హేమ రిపోర్ట్స్ కూడా ఉన్నట్టు ప్రకటించారు. ఇక ఈరోజు అనూహ్యంగా ఆమెను బెంగళూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఫార్మాలిటీస్ లో భాగంగా ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అక్కడికి ఆమె బురఖాలో వెళ్లినట్టు ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

మరోపక్క కోర్టు.. హేమకి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. హేమని పోలీసులు తీసుకు వెళ్తున్న టైంలో కూడా ఆమె ‘నేను ఏ తప్పు చేయలేదు.. హైదరాబాద్లోని మా ఇంట్లో నుండే బిర్యానీ చేసి వీడియో పెట్టాను’ అంటూ చెప్పుకొస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇలా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags