Actress Hema: ‘మా’ ఫలితాలపై హేమ షాకింగ్ కామెంట్స్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల గురించి నటి హేమ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు విజయవాడలో కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్న హేమ మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ దీవెనలు పొందడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. దుర్గమ్మపై తనకు అపారమైన నమ్మకం ఉందని హేమ పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా అమ్మ దీవెనలను పొందడం సంతోషంగా ఉందని హేమ చెప్పుకొచ్చారు. సంతోషంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయని ఆమె అన్నారు. రాత్రికి గెలిచినట్టు ప్రకటించిన తమ ప్యానెల్ సభ్యులు ఉదయానికి ఏ విధంగా ఓడిపోయారో తనకు అర్థం కావడం లేదని హేమ చెప్పుకొచ్చారు.

అలా ఓడిపోవడానికి గల కారణం అమ్మవారికి అయినా తెలుసో లేదో అంటూ హేమ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసిన అనసూయ ఫలితం గురించి జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. టీవీ ఛానెళ్లలో అనసూయ గెలిచిందని వార్తలు రాగా అక్టోబర్ 11వ తేదీన అనసూయ ఓడిపోయినట్టు ప్రకటన వెలువడింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు సైతం ఎన్నికల ఫలితాల విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మాత్రం ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల ఆరోపణలలో నిజం లేదని చెప్పుకొచ్చారు. అధికారిక ప్రకటన చేయకముందే మీడియాలో అనసూయ గెలిచినట్టు ప్రచారం జరిగిందని తాను బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లలేదని కృష్ణమోహన్ వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు విష్ణు ప్యానల్ సభ్యులపై తరచూ ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus