హేమ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా..?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి హేమకు కూతురుందనే విషయం చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న హేమ తన కూతురిని పరిచయం చేయగా.. ఈమెకి ఇంత పెద్ద కూతురుందా అని అందరూ షాక్ అవుతున్నారు. కమెడియన్ అలీ హోస్ట్ చేసే ‘అలీతో సరదాగా’ షోలో ఒకప్పటి లేడీ కమెడియన్ శ్రీలక్ష్మితో కలిసి పాల్గొంది నటి హేమ. ఈ షోలో వీరిద్దరూ తమ సినీ జీవితంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. నటి హేమ విషయానికొస్తే.. ఈమె సినిమాల్లోకి రావడానికి ముందు ఓ డాన్స్ డైరెక్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంది.

హీరోయిన్ అవుదామనుకున్న హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. తెలుగులో ఈమె నటించిన తొలి చిత్రం కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘భలే దొంగ’. ఈ సినిమాలో హేమ.. రావు గోపాలరావు కూతురు పాత్రలో నటించింది. రాజోలులో జన్మించిన హేమ అసలు పేరు కృష్ణవేణి. ఇప్పటివరకు ఈమె తెలుగులో 475 సినిమాల వరకు నటించినట్లు చెప్పుకొచ్చారు. ఈ షోలో హేమ తన భర్త సయ్యద్ జాన్ అహ్మద్ ఎంతో అమాయకుడని చెప్పుకొచ్చింది.

అంతేకాదు తన కూతురిని కూడా ఈ షో ద్వారా పరిచయం చేసింది. ప్రస్తుతం ఆమె బీబీఏ చదువుతోంది. షోలో హేమ కూతురిని చూసిన వారంతా షాకయ్యారు. ఈమెకి పెళ్లీడుకొచ్చిన కూతురుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈమెలో హీరోయిన్ కి కావాల్సిన లక్షణాలు ఉన్నాయని.. త్వరలోనే హీరోయిన్ గా పరిచయం చేసినా.. ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి హేమకి ఇలాంటి ఆలోచన ఉందో లేదో చూడాలి!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28


Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus