వాళ్లిచ్చిన రెమ్యునరేషన్ తోనే ఇల్లు కొన్నా.. హిమజ కామెంట్స్!

బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ లకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారనే విషయంలో క్లారిటీ లేదు. ఈ విషయాలను బయటకొచ్చిన కంటెస్టెంట్ లు కూడా చెప్పడానికి ఇష్టపడరు. దీంతో రెమ్యునరేషన్ పై ఎక్కువ వినిపించేవి వదంతులే. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ హిమజ తనకిచ్చిన రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు తనకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ అందిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సినిమాలకు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు బిగ్ బాస్ వాళ్లు ఇచ్చారని అన్నారు. వారానికి ఇంత అని బిగ్ బాస్ నిర్వాహకులు పేమెంట్ ఇస్తారని చెప్పారు. షోలో సంపాదించిన డబ్బుతోనే ఇల్లు కొన్నానని వెల్లడించారు హిమజ. అయితే ఆ మొత్తం ఎంతనే విషయాన్ని మాత్రం హిమజ చెప్పలేదు. నటిగా ఆమె చాలా సినిమాల్లో నటించింది. కానీ బిగ్ బాస్ షోతోనే పాపులారిటీ సంపాదించింది. నిజానికి బిగ్ బాస్ సీజన్ 1 సమయంలోనే ఆమెని సంప్రదించారట. కానీ సినిమాల వలన కుదరలేదట.

ఆ తరువాత సీజన్ 2కి కూడా పిలిచారని.. ఫైనల్ గా సీజన్ 3లో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షోలో జరిగేదంతా స్క్రిప్టెడ్ అని చాలా మంది భావిస్తారని.. కానీ అందులో నిజం లేదని.. ఏరోజు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హిమజ ‘జ’ అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus