ileana: ఇలియానాకు ఇష్టమైన ప్రదేశం ఇదే!

టాలీవుడ్ ప్రేక్షకులకు ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవదాస్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఇలియానా తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. పదేళ్ల క్రితమే కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని ఇలియానా వార్తల్లో నిలవడం గమనార్హం. తెలుగులో బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ లో ఇలియానాకు ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ తో వెలుగు వెలిగిన ఇలియానా బాలీవుడ్ లో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ఇలియానా రీఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడం గమనార్హం. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇలియానా అడపాదడపా సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలు ఇలియానా కెరీర్ ను ప్లస్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే తాజాగా తనకు మద్యం తాగే అలవాటు ఉందని ఇలియానా చెప్పకనే చెప్పేశారు. మందు సీసాలు ఉన్న దుకాణాన్ని చూపిస్తూ తనకు ఇష్టమైన ప్రదేశం అని ఇలియానా పేర్కొన్నారు.

ఎవరికైనా సాల్ట్ ఎక్కువైందని అనిపిస్తే టెక్విలా ఇస్తానని ఇలియానా పేర్కొన్నారు. ఇలియానా పోస్ట్ ను చూసి కొందరు నెటిజన్లు ఆమె పచ్చి తాగుబోతా అని కామెంట్లు చేస్తుండటం గమనార్హం. 2020 ఇలియానాకు నటిగా పెద్దగా కలిసిరాలేదు. ఈ ఏడాదైనా ఇలియానా వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus