Indraja: మహిళల సమస్యల గురించి ఇంద్రజ కామెంట్స్… సెటైర్ల వర్షం కురిసిందిగా

నిన్నటి తరం హీరోయిన్ ఇంద్రజ అందరికీ సుపరిచితమే. కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగిన ఈమె దాదాపు 80 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబంలో జన్మించిన ఈమె ఓ సింగర్ కూడా అన్న విషయం చాలా మందికి తెలీదు అనే చెప్పాలి. ఈమె అసలు పేరు రజతి అని కూడా ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. ‘చిన్ని చిన్ని ఆశ’ ‘ సొగసు చూడతరమా’ ‘యమలీల’ ‘పెద్దన్నయ్య’ ‘ఒక చిన్నమాట’ వంటి సినిమాల్లో ఈమె నటించి మంచి పేరు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే జబర్దస్త్ తో పాటు పలు బుల్లితెర షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంద్రజ నెలసరి సమయంలో మహిళలకు ఉపయోగపడే ప్రత్యేక ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసేందుకు వెళ్ళింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ పై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. సరే ఇంతకీ ఇంద్రజ ఏం మాట్లాడిందో చూద్దాం. ‘ఆదివారం నాడు మహిళా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. ఇంకా ఆడా, మగా సమానం అనే భావన రాలేదు.మహిళలు అన్ని రంగాల్లో మగవారితో రాణిస్తున్నారు.

అంతరిక్షంలోకి సైతం అడుగుపెట్టారు. కానీ మన దగ్గర మాత్రం మహిళలకు కనీసం 30 శాతం సమాన అవకాశం ఇవ్వడానికి కూడా మగవారికి మనసు రావడం లేదు. ఈరోజుకి కూడా చాలా మంది మహిళలు రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మన సమస్యలు పదే పదే మగవారికి చెప్పుకోవడం వల్ల, వారిలో ఎలాంటి మార్పు ఉండదు. ఓపికగా భరించడం నేర్చుకోండి. అప్పుడు వారికి అర్థమవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది ఇంద్రజ.

అయితే ఈ స్పీచ్ పై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. కొంతమంది ఇంద్రజ క్లారిటీ లేకుండా మాట్లాడింది అంటుంటే మరికొంతమంది మాత్రం.. ‘ఆమె కామెంట్స్ లో ఎంతో డెప్త్ ఉంది’ అంటూ ఆమె డైలాగ్ తో సెటైర్లు వేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus