విజయలక్ష్మి వడ్లపాటి.. ఇలా చెబితే చాలా మందికి తెలీదేమో.. అదే సిల్క్ స్మిత (Silk Smitha) అంటే మాత్రం తెలియని వారంటూ ఉండరు. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఈమెకు అవకాశాలు రాకపోగా ఎన్నో అవమానాలు ఎదురవ్వడం వల్ల.. ఐటెం గాళ్ గా మారి తన అందంతో ఓ ఊపు ఊపేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల సినిమాల్లోనూ ఈమె నటించి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఓ రకంగా మొదటి పాన్ ఇండియా స్టార్ ఈమెనే అని చెప్పాలి.
అయితే కెరీర్ మంచి ఊపు మీద ఉన్న టైంలో 1996 సెప్టెంబర్ 23 న చెన్నైలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈమె మృతికి కారణాలు ఏంటి అన్నది ఎవ్వరికీ తెలీదు. ఈమె జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’ లో కూడా కల్పితం ఎక్కువ ఉంది అనే కామెంట్స్ వినిపించాయి. అయితే సిల్క్ స్మితతో కలిసి పలు సినిమాల్లో నటించిన జయమాలిని (Jayamalini) ఇటీవల సిల్క్ స్మిత పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
జయమాలిని మాట్లాడుతూ.. అతి తక్కువ టైంలో పేరు, ప్రఖ్యాతలతో పాటు డబ్బు కూడా సంపాదించుకుంది నటి సిల్క్ స్మిత. మేము పలు సినిమాల్లో కలిసి నటించినా.. షూటింగ్ స్పాట్లో ఆమె నాతో ఎప్పుడూ మాట్లాడేది కాదు. కానీ ఓ సినిమాలో మాత్రం హీరోతో కలిసి నేను, మా అక్క జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత నటించాల్సి వచ్చింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సిల్క్ స్మిత ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అనిపించింది.
ఆమె చేసిన పెద్ద తప్పు అదే. ప్రేమించడం అనేది తప్పు కాదు. కానీ, తల్లిదండ్రులను విడచిపెట్టి ఉండకూడదు. ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మడం అనేది ఇంకా పెద్ద తప్పు.అతను ఆమెను బాగా మోసం చేశాడు. అదే సమయంలో ఆమె పక్కన తల్లిదండ్రులు ఉండుంటే.. బాధలో ఉందని అండగా ఉండేవారు కదా. ఇండస్ట్రీ ఎవరికైనా సరే అయినవాళ్లు లేరు అంటే మోసం చేయడానికి రెడీగా ఉంటారు. సిల్క్ స్మిత జీవితం ముగిసిపోవడానికి కారణం అదే” అంటూ చెప్పుకొచ్చింది.
షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?