బాలీవుడ్ నటి జూహీ చావ్లా కి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. అంతేకాదు రూ.20 లక్షలు జరిమానా కూడా విధించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 5జీ నెట్వర్క్ ట్రయల్స్ వద్దంటూ జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే శుక్రవారం నాడు ఈ విషయం పై జరిగిన సెషన్ లో .. ఆమె ఫిటిషన్ పై వ్యతిరేకత చూపింది కోర్టు. ‘టెక్నాలజీ అనేది అప్ గ్రేడ్ కావాలి’ అంటూ తీర్మానించింది.
ఈ క్రమంలో కోర్టు సమయాన్ని వృధా చేసిందంటూ .. నటి జూహీ చావ్లాకి రూ. 20 లక్షల జరిమానా విధించింది కోర్టు. దీనికి తోడు కోర్టు సెషన్ జరుగుతున్న టైములో ఆమె అభిమాని పాట పాడడం.. అందుకు సంబంధించిన వీడియోను అంతర్జాలంలో షేర్ చేయడం పై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మాత్రం దానికి కోర్టును ఆశ్రయించేకంటే.. ముందు ప్రభుత్వానికి లేఖ రాస్తే బాగుండేదని హైకోర్టు అభిప్రాయపడింది.
జూహీ చావ్లా జారీ చేసిన పిటిషన్ లో సరైన ప్రాముఖ్యమైన విషయాలు ఏమీ లేవని.. కేవలం పబ్లిసిటి కోసమే ఆమె పిటిషన్ వేసింది అంటూ సీరియస్ గా స్పందించింది. ‘దేశంలో 5జీ టెక్నాలజీ ట్రయిల్స్ జరిగితే..అది తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తుంది’ అనేది జూహీ చావ్లా అభిప్రాయం. దీనికి సంబంధించి 5 వేల పేజీల పిటిషన్ ను ఆమె జారీ చేయడం జరిగింది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!