Jyothi: ఆ టైంలో నాకు ఇల్లు అద్దెకు కూడా ఇవ్వలేదు : జ్యోతి

  • May 24, 2024 / 11:48 AM IST

నటి జ్యోతి (Jyothi) అందరికీ సుపరిచితమే. ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమాలో తిలోత్తమ పాత్రతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఆమెకు ‘ఎవడిగోల వాడితే’ ‘హంగామా’ ‘దరువు’ (Daruvu) ‘యముడికి మొగుడు’ (Yamudiki Mogudu) ఇలా చాలా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. గతంలో ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టు వార్తలు వచ్చాయి.. అయితే కచ్చితంగా ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. ఆ తర్వాత కూడా ఈ సినిమాల్లో నటించింది. అయితే ఈమె పై ఆరోపణలు వచ్చిన టైంలో అనేక ఇబ్బందులు పడినట్టు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పుకొచ్చింది.

అవి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. జ్యోతి మాట్లాడుతూ..”సినీ పరిశ్రమలోనే కాదు సమాజంలో కూడా వ్యాంప్ పాత్రలు చేసేవారిపై చులకన భావన ఉంది. అందువల్ల నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నాపై శృంగార పరమైన ఆరోపణలు వచ్చినప్పుడు.. నేను ఉంటున్న అద్దె ఇంట్లో నుండి నన్ను ఖాళీ చేయించేశారు. ఆ టైంలో రెండేళ్ల నా కొడుకుని ఎత్తుకుని తీసుకుని అద్దె ఇంటి కోసం వీధి వీధి తిరిగాను.

నాకు అద్దెకు ఇల్లు ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. నా కొడుకుని తీసుకుని రోడ్లపై ఏడుస్తూ తిరిగాను. ఇండస్ట్రీలో నన్ను చాలా చులకనగా చూసేవారు. స్నేహితులు కూడా ఆ టైంలో నా మొహం చాటేశారు. ఒంటరి దాన్ని అయిపోయాను. నేను తప్పు చేసి ఉంటే పర్వాలేదు. కానీ నేను ఏ తప్పు చేయకపోయినా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus