Jyothi Rai: భర్త పై నటి జ్యోతి రాయ్ పోస్ట్ వైరల్..!

Ad not loaded.

‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ తో బాగా పాపులర్ అయ్యింది జ్యోతి రాయ్. అందులో జగతి అనే పాత్రలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈమె కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అని చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతకాలం క్రితం ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి ఇంకో డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఏ మాస్టర్ పీస్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు సురేష్ కుమార్‌తో జ్యోతి రాయ్ పెళ్లి జరిగింది.

సురేష్ కుమార్ ను సుకు పూర్వాజ్ అని అంటారన్న సంగతి తెలిసిందే.తాజాగా ఇతని బర్త్ డే సందర్భంగా జ్యోతి రాయ్ చేసిన పోస్ట్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ ద్వారా ఆమె స్పందిస్తూ.. “మనం కలిసి ఏడాది దాటింది. నీ వల్ల నా జీవితం మొత్తం మారిపోయింది. నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు చూపిస్తున్న ప్రేమ, లవ్, ఇచ్చే హగ్స్, కిస్సులు, సపోర్ట్, ఎంకరేజ్మెంట్, నీ పాజిటివ్ థాట్స్ ఇలా అన్నింటికీ థాంక్స్..

నీ సహనం.. నాపై చూపించే ప్రేమ, కేరింగ్, విధేయత ఇలా అన్నింటికీ థాంక్స్..నీ వల్లే నా జీవితం సంపూర్ణమైంది.. నువ్వు నా భర్తగా దొరకడం నా అదృష్టం.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. లవ్ యూ అన్ కండీషనల్లీ” అంటూ అందులో రాసుకొచ్చింది. ప్రస్తుతం జ్యోతి రాయ్ (Jyothi Rai) పోస్ట్ వైరల్ గా మారింది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus