కాజల్.. సౌత్ కీన్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువ అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.కానీ మన కాజల్ మాత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిందనే చెప్పాలి.13 ఏళ్ళ నుండీ ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.ఒక్క తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది కాజల్.’లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కాజల్ .. రెండేళ్ళకే ‘మగథీర’ చిత్రంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.అప్పటి నుండీ కాజల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించేసింది.

తమిళంలో కూడా దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసింది. బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని ట్రై చేసింది కానీ అక్కడ మాత్రం ఈమె సక్సెస్ కాలేకపోయిందనే చెప్పాలి. అయితే టాలీవుడ్ లో మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే రాణిస్తుంది. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. నిన్న ఈమె పుట్టిన రోజు కావడంతో కాజల్ అభిమానులు సోషల్ మీడియాలో ఈమె బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేసారు.

దాంతో కాజల్ ఫ్యాన్స్.. సమంత పేరుతో ఉన్న రికార్డునే బ్రేక్ చేసారు. ఇప్పటి వరకూ సమంత బర్త్ డే ట్యాగ్ 254k ట్వీట్స్ తో టాప్ లో ఉండగా… రెండో ప్లేస్ లో అనుష్క 156k ట్వీట్స్ , కీర్తి సురేష్‌ 91.5k ట్వీట్స్ తో.. మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు కాజల్ 260k ట్వీట్స్ తో మొదటి స్థానంలోకి వచ్చేసింది. కాజల్ అగర్వాల్ ను సౌత్ క్వీన్ అని ఎందుకు అంటారో దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus