ఇటీవల సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు ప్రమాదకరంగా మారుతున్నారు. టెక్నాలజీని యువత దుర్వినియోగం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకి సంబందించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో నేషనల్ వైడ్ సంచలనంగా మారింది. డీప్ నేక్ ఉన్న వీడియోకి రష్మిక మొహాన్ని యాడ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కొందరు ఆకతాయిలు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
ఈ డీప్ ఫేక్ వీడియోపై దాదాపు టాప్ సెలబ్రెటీస్ అందరు స్పందించారు. ఇలాంటి వారిని ఉపేక్షించకూడదని, ఆ వీడియో చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే వేగంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి.. ఆ వీడియో చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారింది. ఈసారి బాలీవుడ్ స్టార్ కాజోల్ ను టార్గెట్ చేశారు.
ఆ వీడియోలో ఎవరో బట్టలు మార్చుకున్నట్లుగా ఉంది. దానికి కాజోల్ పేస్ ను యాడ్ చేసి వీడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా లెక్కచేయకుండా.. ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు చేస్తున్న ఆకతాయిలపై ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నారో చూడాలి. దీన్ని ఎడిట్ చేసిన వారిపై కాజోల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అయితే కాజోల్ (Kajol) ఫేస్‌తో మార్ఫింగ్ చేసిన ఈ వీడియో టిక్ టాక్ స్టార్ రోసిబీరిన్స్ గా గుర్తించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు సెలబ్రెటీలు కోరుతున్నారు. కాజోల్ వీడియో ఘటనపై అజయ్ దేవగన్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. చేయకూడదని ఫ్యాన్స్ కోరుతున్నారు.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!