బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రౌనత్ సోషల్ మీడియా వేదికగా ఒక చిన్న పోస్ట్ చేసినా, లేదా ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఆమె చేసే వ్యాఖ్యలు సంచలనంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈమెను ఏకంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ పిలుస్తూ ఉంటారు.ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న కంగనా నిత్యం బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల గురించి ఏదో ఒక విషయంలో విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ కిడ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఈమె మరోసారి బాలీవుడ్ సెలబ్రిటీలు పై విమర్శలు చేశారు.
తాజాగా కంగనా నటించిన ధాకడ్ చిత్రం ఈ నెల 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈమె ఈ సినిమాని ప్రమోట్ చేయడం కన్నా బాలీవుడ్ హీరోలను విమర్శించడం ఎక్కువగా ఉంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఆదివారం కంగనా ఇంట్లో అతిథులుగా విందు చేయాల్సి వస్తే ఆ అదృష్టం ఏ ముగ్గురు సెలబ్రిటీలకు ఇస్తారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నా ఇంటికి వచ్చి భోజనం చేసే అంత విలువ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఒక్క సెలబ్రిటీకి లేదంటూ నిర్మొహమాటంగా చెప్పేశారు.
అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ గురించి ప్రస్తావిస్తూ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ప్రశ్నించారు.తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహితులు ఎవరూ లేరని తనతో స్నేహం చేయాలన్న ఒక అర్హత ఉండాలని, ఆ అర్హత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికీ లేదు అంటూ ఈమె బాలీవుడ్ స్నేహితుల గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఈ విధంగా కంగనా బాలీవుడ్ సెలబ్రిటీల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.