సినిమాలకు టీజర్ లుక్‌లు, లుక్‌లు, టీజర్‌లు, ట్రైలర్ అని ఉన్నట్లే… మన సినిమా జనాలు ఈ మధ్య వాళ్ల రియల్ లైఫ్‌లో కూడా ఇలాంటి కాన్సెప్ట్‌లు పాటిస్తున్నారు. పెళ్లి విషయంలో, ఎంగేజ్‌మెంట్ విషయంలో ఇలాంటి ఆలోచనలే చేస్తున్నారు. ‘కాబోయే శ్రీవారు?’ అంటూ చిన్నగా టీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత సగం కనిపించే ఫొటో పెడుతున్నారు. ఆ తర్వాత అసలు ఫొటో ఇస్తున్నారు. ఇదే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతూ ప్రముఖ నటి రాధ తనయ కార్తిక కూడా తన కాబోయే శ్రీవారును పరిచయం చేసింది.
నటి రాధ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే వావ్ అనిపించుకుంది కార్తిక. అయితే ఏమైందో ఏమో ఎనిమిదేళ్ల నుండి వెండితెరకు దూరంగా ఉంది. అంతేకాదు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు ఇటీవల ప్రకటించింది కూడా. ఈ మేరకు గత నెలలో ఎంగేజ్‌మెంట్ పిక్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తనకు కాబోయే భర్త రోహిత్ మేనన్‌ను నెటిజన్లకు, అభిమానులకు పరిచయం చేసింది. రోహిత్‌తో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
అంతేకాదు ఆ ఫొటోతోపాటు ‘‘నిన్ను కలవడం అనేది నా విధి. నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్ అని చెప్పాలి. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్‌డౌన్ ప్రారంభించాను’’ అని రాసుకొచ్చింది. దీంతోపా ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాబోయే వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. రెండు ఫొటోలు కాస్త సంప్రదాయబద్ధంగా ఉంటే… మరో ఫొటో కాస్త రొమాంటిక్ ఉంది.
ఇక కార్తిక సంగతి చూస్తే… 2009లో వచ్చిన ‘జోష్’ సినిమాతో (Karthika Nair) కార్తిక హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2011లో ‘రంగం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘దమ్ము’, అల్లరి నరేశ్ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. అయితే ఈ క్రమంలో సరైన విజయాలు అందుకోలేకపోయింది. దీంతో 2015 నుండి వెండితెరకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు ఓ ఇంటిది అవుతోంది.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!