Actress Kasthuri: ఎఫైర్ వార్తలపై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసిన కస్తూరి..!

కస్తూరీ శంకర్ .. పరిచయం అవసరం లేని పేరు. ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యే ‘గృహలక్ష్మి’ సీరియల్ తో ఆమె తన ఫాలోయింగ్ ను పెంచుకుంది. అయితే గతంలో ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.’గ్యాంగ్ వార్’ ‘నిప్పు రవ్వ’ ‘గాడ్ ఫాదర్'(ఏఎన్నార్- వినోద్ కుమార్) ‘భారతీయుడు’ ‘అన్నమయ్య’ ‘చిలక్కొట్టుడు’ ‘డాన్ శీను’ ‘గాడ్ ఫాదర్'(2022) వంటి సినిమాల్లో నటించిన ఈమె వివాదాలతో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికీ ఈమె గ్లామర్ షో విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.48 ఏళ్ల వయసులో కూడా స్కిన్ షో కి ఈమె వెనుకాడడం లేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె 60 ఏళ్ల ముసలి బిజినెస్ మెన్ తో ఎఫైర్ కొనసాగిస్తుందని, అతనితో కలిసి విచ్చల విడిగా ప్రైవేట్ టూర్లు వేస్తుందని కథనాలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తల పై కస్తూరి మొదటిసారి స్పందించింది. ‘ఇలాంటి వార్తలు విని విని నాకు చాలా బాధ కలుగుతుంది.

సినీ పరిశ్రమలో ఉన్న నటీమణులపై ఇలాంటి వార్తలు రావడం కామన్. కానీ నాపై వస్తున్న ఈ వార్తలు చాలా బాధ పెడుతున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. మరోపక్క ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొనడంలో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు ఈ బ్యూటీ.

ఎద అందాలు, నడుము అందాలు ఒక్కటేంటి? ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు. ఇటీవల సరోగసి పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అయిన నయన్- విఘ్నేష్ ల పై కూడా ఈమె చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus