Kasturi, Jr NTR: ఇక్కడ తెలుగు మాట్లాడొచ్చు కదా… మంచు లక్ష్మిపై సెటైర్స్ వేసిన కస్తూరి శంకర్!

  • February 28, 2023 / 10:24 AM IST

సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రేటిల గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడం సర్వ సాధారణం. అయితే కొందరు నేటిజన్స్ సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తుంటారు.కొందరు ఇలా సెలబ్రిటీల గురించి వచ్చే ట్రోల్స్ ను పూర్తిగా తిప్పి కొడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి కస్తూరి శంకర్ ఎన్టీఆర్ గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో భాగంగా అమెరికాలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన అమెరికన్ యాక్సెంట్‌ చూసి అక్కడ మీడియా ప్రతినిధులు ఎంతో ఆశ్చర్యపోయారు కానీ ఇండియాలో మాత్రం ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్‌ వల్ల ఆయన పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురయ్యారు.

ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె మాట్లాడుతూ…అమెరికా వాళ్లకు వాళ్ల స్లాంగ్ లోనే మాట్లాడితేనే అర్థమవుతుంది అలా కాకుండా ఇండియన్ ఇంగ్లీష్ లో మాట్లాడితే వారికి అర్థం కాదని తెలియజేశారు. ఇండియన్ ఇంగ్లీష్ లో మాట్లాడితే అమెరికా వాళ్లకు అర్థం కాదు కనుక ఎన్టీఆర్ అమెరికా యాక్సెంట్‌ లో మాట్లాడారు. ఇందులో ఎన్టీఆర్ తప్పు ఏమాత్రం లేదని తెలిపారు. కానీ ఇండియాలో మాత్రం ఎన్టీఆర్ యాక్సెంట్‌ పూర్తిగా ఫేక్ అని, ట్రోల్ చేశారు.

ఇలా ట్రోల్ చేయడం చాలా పెద్ద తప్పు అంటూ ఈమె ఎన్టీఆర్ కి మద్దతు తెలిపారు. ఇక తాను కూడా అమెరికాలో ఉంటున్నానని అక్కడ వారికి ఎలా మాట్లాడితే అర్థం అవుతుందో నాకు తెలుసు అని ఈమె తెలిపారు. ఇక ప్రస్తుతం తాను చెన్నైలో ఉంటున్నానని అలాగని తమిళ యాక్సెంట్‌లో మాట్లాడితే తెలుగు వారికి అర్థం కాదని ఈమె తెలిపారు. అయితే కస్తూరి శంకర్ ఇలా మాట్లాడటంతో వెంటనే యాంకర్ మంచు లక్ష్మీ ప్రస్తావన తీసుకువస్తూ ఆమె మాట తీరుపై కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కస్తూరి సమాధానం చెబుతూ నిజమైన ప్రయత్నానికి.. కావాలని చేసే ఫేక్‌ ప్రయత్నాని తేడా ఉంది కదా అన్నది. హైదరాబాద్‌కి వచ్చి అలాంటి యాక్సెంట్‌లో మాట్లాడితే తప్పకుండా ట్రోల్ చేస్తారని ఇక్కడ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడవచ్చు కదా అంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మికి చురకలంటిస్తూ తనని ఎన్టీఆర్ తో అసలు పోల్చవద్దని చెప్పకనే చెప్పారు. ఇలా ప్రస్తుతం మంచు లక్ష్మి , ఎన్టీఆర్ గురించి కస్తూరి శంకర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus