Keerthy Suresh: పెళ్లి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన నటి కీర్తి సురేష్!

దక్షిణాది సిని ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మహానటి సినిమాతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో నటిగా ఎంతో బిజీగా గడుపుతున్న కీర్తి సురేష్ పెళ్లి గురించి గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈయన కేరళలో ఒక రిసార్ట్ రన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇలా గత 13 సంవత్సరాల నుంచి రిసార్ట్ ఓనర్ తో ప్రేమలో ఉన్నటువంటి కీర్తి సురేష్ తాజాగా తనని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నటి కీర్తి సురేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఈమె తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ తాను ఎవరితోనూ ప్రేమలో లేనని తాను ప్రేమ వివాహం చేసుకోబోతున్నాను అంటూ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈమె తెలియజేశారు.

తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలు కూడా లేవని తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలను ఖండించారు. ఇలా పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ స్పందించడంతో ఈ రూమర్లకు చెక్ పెట్టినట్లు అయింది. ఇకపోతే కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తెలుగులో నాని సరసన దసరా అనే సినిమాలో నటిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న

ఈ సినిమా మార్చి 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాని కీర్తి సురేష్ ఇద్దరు కూడా డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేయగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus