సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు లేదా సినీ పరిశ్రమకు చెందిన కుటుంబ సభ్యులు, ఫ్యాషన్ డిజైనర్లు ఇలా ఎవరోకరు మరణిస్తూనే ఉన్నారు. అనారోగ్య సమస్యలతో కొంతమంది, వయసు సంబంధిత సమస్యలతో మరికొంతమంది రోడ్డు ప్రమాదాల్లో, ఇంకొంత మంది అయితే సూసైడ్ చేసుకుని .. ఇలా ప్రాణాలు విడిచారు. టాలీవుడ్లోనే కాకుండా మిగతా భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా మరణించడం జరిగింది.
తాజాగా జైసన్ జోసెఫ్ అనే నిర్మాత విగతజీవిగా మారి కనిపించి షాకిచ్చాడు. ఆ ఘటన అందరికీ షాక్ కు గురిచేసింది. అది గడవక ముందే మరో నటి క్యాన్సర్ తో మరణించింది. వివరాల్లోకి వెళితే.. నటి కిర్‌స్టీ అల్లీ ఇటీవల క్యాన్సర్ తో మరణించారు.చాలా కాలంగా ఈమె క్యాన్సర్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుందట. అయితే సోమవారం నాడు ఈమె పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
వైద్యులు మెరుగైన చికిత్స అందించినా ఈమె ప్రాణం నిలబడలేదు అని తెలుస్తుంది. కిర్‌స్టీ అల్లీ హాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి తనదైన శైలిలో అక్కడి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అంతేకాకుండా పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకుంది. ఈమె విషాదం అక్కడి పరిశ్రమకు చెందిన చాలా మంది సినీ ప్రముఖులను విషాదంలోకి నెట్టేసింది.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!